Friday, April 26, 2024

Breaking : సినిమా షూటింగ్ లో కుప్ప‌కూలిన న‌టుడు ఉపేంద్ర‌.. హాస్ప‌ట‌ల్ కి త‌ర‌లింపు

ఓ సినిమా షూటింగ్ లో కుప్ప కూలారు న‌టుడు ఉపేంద్ర‌.దాంతో ఆయ‌న్ని చిత్రబృందం ఆస్పత్రికి తరలించినట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. షూటింగ్ సమయంలో శ్వాస కోసం సంబంధిత సమస్యతో ఇబ్బంది పడటం వల్ల హాస్పిటల్​కు వెళ్లినట్లు ఆ కథనాల్లో ఉంది. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఉపేంద్రకు కన్నడతో పాటు తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లోనూ మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఉపేంద్ర చేసిన పాత్రలు ప్రేక్షకులు చిరకాలం గుర్తుంచుకుంటారు. సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర పాత్రకు టాలీవుడ్ ఫిదా అయింది. ప్రస్తుతం ఉపేంద్ర బుద్దివంత 2, త్రిశూలం, కబ్జా సహా మరో చిత్రంలో నటిస్తున్నారు. ఇవన్నీ శరేవగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement