Thursday, April 25, 2024

OTTలోకి రాబోతున్న రష్మిక హిందీ డెబ్యూ ‘గుడ్ బై’

టాలీవుడ్‌లో మంచి అభిమానాన్ని పోందిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న గుడ్‌బై సినిమాతో బాలీవుడ్‌లో తొలి అడుగు వేసింది. వికాస్ భ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో రష్మిక మందన్న కు నాన్నగా అమితాబ్‌బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఆధునిక జీవ‌న‌శైలి, ఆర్థిక సంబంధాలు మ‌నుషుల మ‌ధ్య దూరాన్ని ఎలా పెంచుతున్నాయ‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు వికాస్ భ‌ల్ గుడ్ బై సినిమాను తెర‌కెక్కించారు. థియేట‌ర్ల‌లో అక్టోబ‌ర్ 7న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది.

అయితే, తాజాగా గుడ్‌బై ఓటీటీ రిలీజ్ డేట్ ఖ‌రారైంది. వచ్చే నెల (డిసెంబ‌ర్) 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. గుడ్‌బై సినిమాతో ప‌రాజ‌యం పాలైన ర‌ష్మిక‌కు మాత్రం బాలీవుడ్‌లో క్రేజ్ భారీగానే ఉంది. తొలుత బాలీవుడ్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కనున్న మిష‌న్ మ‌జ్ను సినిమాపై సంత‌కం చేసింది ర‌ష్మిక మంద‌న్న‌. కానీ మొద‌ట గుడ్‌బై సినిమా విడుద‌లైంది. ఇక ప్ర‌స్తుతం ర‌ణ్‌బీర్‌క‌పూర్‌తో యానిమ‌ల్ సినిమా చేస్తోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement