Saturday, April 27, 2024

వీడియో సాంగ్ పోస్ట్ చేసి.. సూసైడ్ చేసుకున్న భోజ్ పురి న‌టి

భోజ్ పురి న‌టి ఆకాంక్ష దుబే సూసైడ్ చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని ఓ హోట‌ల్ లో ఆమె మృత‌దేహం ల‌భ్య‌మ‌యింది.కాగా ఆమె వయస్సు 25 సంవత్సరాలు. ఆకాంక్ష సింగ్ మరణించడానికి ముందే వీడియో సాంగ్ ను స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో సాంగ్‌లో ఆకాంక్ష భోజ్‌పురి సూపర్‌స్టార్ పవన్ సింగ్‌తో కలిసి కనిపించింది. ఈ పాట పోస్టర్‌ను ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. పాట లిరిక్స్ ‘యే ఆరా కభీ నహీ హరా’. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆకాంక్ష దూబే వారణాసిలో ఓ హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి షూటింగ్ ముగించుకుని ఆమె హోటల్‌కు చేరుకుందని చెబుతున్నారు. ఈమె 21 అక్టోబర్ 1997న ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో జన్మించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని తెలుస్తుంది. ఇన్‌స్టాలో ఆకాంక్ష దూబేకి దాదాపు 17 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement