Monday, May 13, 2024

డిగ్రీ కోర్సులతో మెరుగైన ఉపాధి..

అమరావతి,ఆంధ్రప్రభ: డిగ్రీ విద్యకు ఆదరణ పెంచేలా, కోర్సులు పూర్తి చేసిన వారికి వెనువెం టనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా ఉన్నత విద్యామండలి చర్యలు తీసుకుంటోంది. అందు కోసం నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ పాలసీ, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ సూచనల మేరకు అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. డిగ్రీ విద్యలోనూ సెమిస్టర్ల విధానం తీసు కొచ్చిన ఉన్నత విద్యాశాఖ పరీక్షల విధానం సంస్కరణలకూ పూనుకుంది. నాలుగేళ్ల హానర్స్‌ డిగ్రీని ప్రవేశ పెట్టిన నేపథ్యంలో వార్షిక పరీక్షలకే కాకుండా ఇంటర్నల్‌ పరీక్షలకూ పాయింట్లు కేటాయించా లని నిర్ణయించింది. తద్వారా విద్యార్థులు ప్రతి పరీక్షనూ ఫైనల్‌లా భావించి, చదవి మంచి మార్కులు తెచ్చుకోవాలన్నదే ఉద్దేశంగా ఉంది. అంతర్గత పరీక్షల్లోనూ విద్యార్థులు చూపించే ప్రతిభను పరిగ ణనలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో వాటిలో వచ్చే మార్కులకూ వెయిటేజీ ఇచ్చి గ్రేడింగ్‌ ఇవ్వనున్నా రు. ఈ సంస్కరణల ద్వారా డిగ్రీ పూర్తి చేసిన వారికీ వెనువెంటనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుతాయి.

పెరగనున్న డిమాండ్‌..

ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు సాధారణంగా ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ కోర్సులు చేయడానికే మొ గ్గు చూపుతున్న పరిస్థితి కొన్నేళ్లుగా ఉంది. ఈ నేపథ్యంలో డిగ్రీ కోర్సులకు ఆదరణ తగ్గుతోంది. ఇంజ నీరింగ్‌, టెక్నికల్‌ కోర్సులు చేస్తే వెంటనే ఉద్యోగాలు లభిస్తాయన్న భావన విద్యార్థులు, వారి తల్లిదం డ్రుల్లో బలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో డిగ్రీ కోర్సులో ఇంటర్న్‌షిప్‌ ప్రవేశపెట్టడం ద్వారా చదువు కునే సమయంలోనే వారికి ఫీల్డ్‌ వర్క్‌, జాబ్‌ వర్క్‌పై అవగాహన కలుగుతుంది. అలాగే కోర్సు పూర్త య్యే సమయంలో ప్లేస్‌మెంట్ల కోసం ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయిం చిన నేపథ్యంలో ఆ దిశగానూ అవకాశాలు మెరుగ్గా ఉండనున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో డిగ్రీ కోర్సులకూ డిమాండ్‌ పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం ద్వారా రాసిన ప్రతి పరీక్షకు, చేసిన ఇంటర్న్‌ షిప్‌, ప్రాజెక్టుకు పాయింట్లు లభిస్తాయి. ఈ పాయింట్లను ఫైనల్‌ మార్క్స్‌ మెమోలోనూ పేర్కొంటారు. ఈ పాయింట్ల ద్వారా విద్యార్థులు ఎలాంటి ఉద్యోగాలకు నైపుణ్యాలు పొంది ఉన్నారో ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్స్‌ తేలిగ్గా గుర్తించవచ్చు. తద్వారా విద్యార్థికి కోర్సు పూర్తయిన వెంటనే మంచి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలు ఉంటాయి.

మల్టిపుల్‌ ఎగ్జిట్‌కు అవకాశం..

ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులు చేసే అవకాశంతోపాటు, డిగ్రీ చదివే విద్యార్థి ఏ ఏడాది పూర్తయిన తర్వాతైనా మరుసటి ఏడాది కోరుకున్న సబ్జెక్టులతో ఉన్న కోర్సుల్లో చేరే అవకాశాన్ని కల్పించేలా ఉన్న త విద్యామండలి చర్యలు తీసుకుంటోంది. యూజీసీ గైడ్‌లైన్స్‌ మేరకు మల్టిపుల్‌ ఎగ్జిట్‌, మల్టిపుల్‌ ఎంట్రీ అవకాశాలు కల్పిస్తోంది. ఈ విధానం ద్వారా విద్యార్థులు కోర్సు చేసే సమయంలో ఏ సంవ త్సరంలో చదువు మానేసినా అప్పటి వరకు పూర్తి చేసిన మేరకు సర్టిఫికెట్‌, క్రెడిట్లు- కేటాయిస్తారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement