Saturday, May 4, 2024

రేపటి నుంచి టెన్త్‌, ఇంటర్ సప్లమెంటరీ ఎగ్జామ్స్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థుల కోసం నిర్వహించే అడ్వా న్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 అంటే రేప‌టినుంచి ప్రారంభం కానున్నాయి. ఒకే తేదీల్లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు జరగ నున్నాయి. ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. జూలై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు జరిగాయి. గత మే 6 నుంచి 24 వరకు జరిగిన ఇంటర్‌ పరీక్షలను సుమారు 9 లక్షల వరకు విద్యార్థులు రాశారు. ఇందులో ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలకు 4,64,626 మంది, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలకు 4,42,768 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఫస్ట్‌ ఇయర్‌లో 63.32 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 67.16 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ క్రమంలోనే ఫెయిల్‌ అయిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు సైతం రేప‌టినుంచే ప్రారంభం కానున్నాయి. ఇవి కూడా ఆగస్టు 10వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిం చను న్నారు. ఆగస్టు 1న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 2న సెకండ్‌ లాంగ్వేజ్‌, 3న ధర్డ్‌ లాంగ్వేజ్‌(ఇంగ్లీష్‌), 4న మ్యాథ్స్‌, 5న జనరల్‌ సైన్స్‌, 6న సోషల్‌ స్టడీస్‌, 8న ఓఎస్‌ఎస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, 10న ఓఎస్‌ ఎస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 పరీక్షలు జరగ నున్నా యి. పదో తరగతి పరీక్షలకు 55,662 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 204 పరీక్షా కేంద్రా లను ఏర్పాటు చేయగా, 2010 ఇన్విజిలేటర్లు, 204 డిపార్ట్‌ మెంటల్‌ ఆఫీసర్లు, 42 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, 204 చీఫ్‌ సూపరింటెండెంట్‌ అధికారులను నియమిం చినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement