Saturday, June 12, 2021

కృత్రిమ కాలుతో ఆమె అందాల పోటీలకు

కలలను సాకారం చేసుకోవడానికి వైకల్యం అడ్డురాదని బెర్నాడెట్‌ అనే యువకులు నిరూపించారు. 22 ఏళ్ల వయసులో బెర్నాడెట్‌కు కీళ్ల క్యాన్సర్ సోకింది. కుడికాలు తీసేయాల్సి వచ్చింది. తనతోపాటు కుటుంబమూ కృంగిపోయింది. కానీ బెర్నాడెట్ బాధపడుతూ కూర్చునే రకం కాదు. తాను తేరుకుని కుటుంబ సభ్యుల విచారాన్ని తొలగించేందుకు నడుం బిగించింది. మెల్లగా కృత్రిమ కాలుకు అలవాటు పడింది. ఇప్పుడు అదే కాలికో ర్యాంప్ వాక్ చేయబోతున్నది.  దీంతో ఆ కుటుంబానికి కలిగిన సంతోషం ఇంతా అంతా కాదు. తనకు అందాల పోటీలకు వెల్లాలని చిన్నప్పటి నుంచి ఉండేది.

బెర్నాడెట్‌ అభిలాషను గుర్తించిన జెబెడీ మేనేజ్‌మెంట్ అనే వికలాంగుల సేవా సంస్థ ఆమెకు అవసరమైన సహాయాన్ని, ధైర్యాన్ని సమకూర్చింది. ఆమె కలల సాకారానికి అండగా నిల్చింది. ఇప్పుడు మిస్ వరల్డ్ ఐర్లాండ్ పోటీల ఫైనలిస్టు జాబితాలో చోటు సంపాదించింది. వచ్చే సెప్టెంబర్‌లో జరిగే ఫైనల్ పోటీలు జరగబోతున్నాయి. ఆ సంగతే సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. కృత్రిమ కాలితో ర్యాంప్ వాక్ చేయబోతున్న మొట్టమొదటి మోడల్‌గా బెర్నాడెట్ చరిత్ర సృష్టించబోతున్నది.

Advertisement

తాజా వార్తలు

Prabha News