Saturday, April 20, 2024

మోహన్‌బాబు ‘సన్నాఫ్ ఇండియా’ టీజర్

డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘సన్నాఫ్ ఇండియా’. ఈ సినిమా టీజర్‌ను హీరో సూర్య శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశాడు. ‘మన అంచ‌నాల‌కు అంద‌ని వ్య‌క్తిని ఇప్పుడు మీకు ప‌రిచ‌యం చేయ‌బోతున్నాను.. త‌న రూటే సె‌ప‌రేటు’ అంటూ మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ తో ఈ టీజ‌ర్ ప్రారంభ‌మ‌వుతుంది. ‘తాను ఎప్పుడు ఎక్క‌డ ఉంటాడో, ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక’ అంటూ చిరంజీవి ఇచ్చిన వాయిర్ ఓవ‌ర్ ఆకర్షిస్తోంది. ‘నేను  చీక‌టిలో ఉండే వెలుతురిని, వెలుతురులో ఉండే చీక‌టిని’ అంటూ మోహ‌న్ బాబు ఇందులో తనదైన శైలిలో డైలాగు చెప్పారు. ‘నేను క‌స‌క్ అంటే మీరంద‌రూ ఫ‌సక్’ అవుతారంటూ ఆయ‌న చివ‌ర్లో మ‌రో డైలాగు వ‌దిలారు. మోహన్ బాబు అనేక ర‌కాల లుక్‌ల‌లో క‌న‌ప‌డుతున్నారు. 

ఈ మూవీకి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాకు మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను పలు నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement