Wednesday, May 22, 2024

అఫ్గనిస్తాన్‌ కోచ్‌గా అవిష్క గుణవర్ధనే..

అప్గనిస్తాన్ ఇప్పుడు తాలిబన్ల నీడలో బిక్కుబిక్కుమంటోంది. ఆ దేశంలో పరిస్థితులు ఎప్పుడ ఏవిధంగా మారుతాయో ఎవరికి తెలియడం లేదు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ క్రికెట్ టీమ్ కి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఓ పక్క తాలిబన్లతో పోరాడుతన్న అఫ్గాన్ దేశం ఇప్పుడు క్రికెట్ లో ఓ తీపి కబురు చెప్పింది. అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కొత్త నిర్ణయం తీసుకుంది. తమ జాతీయ జట్టు కోచ్‌గా శ్రీలంక మాజీ ఆటగాడు అవిష్క గుణవర్ధనేను నియమించింది. గుణవర్ధనే శ్రీలంక జట్టు తరఫున 6 టెస్టులు, 61 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. టి10 టోర్నీ సందర్భంగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న గుణవర్ధనేను ఐసీసీ గత మే నెలలోనే నిర్దోషిగా ప్రకటించింది. అసలు తాలిబన్ల రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన అక్కడి ప్రజలకు కొంత ఊరట కలిగిస్తుందనే చెప్పాలి.

ఇది కూడా చదవండి: వినాయక చవితి రోజు ‘లవ్ స్టోరీ’ రిలీజ్…అఫీషియల్

Advertisement

తాజా వార్తలు

Advertisement