Sunday, May 5, 2024

వినాయక చవితి రోజు ‘లవ్ స్టోరీ’ రిలీజ్…అఫీషియల్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్, లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కాగా ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఉత్కంఠకు తెరదించుతూ… చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement