Friday, May 3, 2024

రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన పూజారులు

ఉత్తరాఖండ్​లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్​నాథ్ ఆలయ పూజారులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రక్తంతో లేఖ రాశారు. కేదార్​నాథ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని కోరుతూ ఆ ఆలయంలోని పూజారులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ థామికి రక్తంతో లేఖలు రాశారు.

దేవస్థానం బోర్డును రద్దు చేయాలని కోరుతూ కేదార్ నాథ్ దేవాలయంలోని ధమ్​ సాకేత్ బగాదీ, నితిన్ బగ్వాడీ పూజారులు.. లేఖలు రాసి తమ నిరసన తెలిపారు. గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీకి పలువురు పురోహితులు ఇలాగే రక్తంతో లేఖలు రాశారు.

కేదార్​నాథ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని దాదాపు రెండు నెలలుగా అర్చకులు ఆందోళన చేస్తున్నారు. బోర్డును ఏర్పాటు చేసినప్పటినుంచి తమ హక్కులకు భంగం కలుగుతోందన్నారు. బోర్డును రద్దు చేసేంతవరకూ ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు.దేవస్థానం బోర్డును రద్దు చేయాలని నినాదాలు చేస్తున్నారు. గత మంగళవారం నుంచి ఉపవాసంతోనే నినాదాలు చేస్తున్నారు. ఈ లేఖలో పురాణ కాలం నుండి కేదార్‌నాథ్‌లో యాత్రికుల అర్చకుల హక్కులకు సంబంధించిన అనేక హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండిః ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement