Saturday, April 27, 2024

ఆక్సిజన్ ప్లాంట్ల ఉత్పత్తికి రూ.309 కోట్లు కేటాయింపు

ఆక్సిజన్‌కు భారీగా డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా 49 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం రూ.309.87 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు రాబోయే 6 నెలలకు రూ.60 లక్షలు మంజూరు చేయనున్నారు. ఈ క్రమంలో 50 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను కూడా కొనుగోలు చేయనున్నారు. అంతేగాకుండా 10 వేల అదనపు ఆక్సిజన్ పైప్ లైన్‌లను ఏర్పాటు చేయనున్నారు. అటు ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ బాధ్యతలను ఐఏఎస్ అధికారి కరికాల వలవన్‌కు అప్పగించారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సరఫరా తీరుతెన్నులను ఆయన పర్యవేక్షిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement