Sunday, April 28, 2024

అందాల పోటీల్లో ఆంధ్రా కోడిపుంజుకు మూడవ స్థానం..

గిద్దలూరు, ఏప్రిల్ 4 (ప్రభ న్యూస్) : కోళ్ల అందాల పోటీలో ఆంధ్రా కోడిపుంజుకు జాతీయ స్థాయిలో మూడ‌వ స్థానం ద‌క్కింది. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ లో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి చిలకముక్కు కోళ్ల అందాల పోటీలలో ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన సయ్యద్ భాషకు చెందిన కోడిపుంజు అందాల పోటీల్లో మూడవ స్థానం దక్కించుకుంది. కోళ్ల అందాల పోటీల నిర్వాహకులు పుంజు యజమాని సయ్యద్ భాషకు బహుమతులు, ప్రశంస పత్రం అందించారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలలో సుమారు ఐదు ఆరు రాష్ట్రాలకు చెందిన వారు తమ కోడి పుంజులతో పోటీలలో పాల్గొంటారు. ఏపీ రాష్ట్రం ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండలం రాజుపాలెం గ్రామం నుండి పోటీలలో పాల్గొని సయ్యద్ భాష కోడిపుంజు బహుమతి గెలుచుకోవడం పై పలువురు హర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement