Thursday, May 2, 2024

మీట‌ర్ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్.. చిరంజీవి

యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టిస్తున్న తాజా చిత్రం మీట‌ర్.ఈ చిత్రంలో హీరోయిన్ గా అతుల్య న‌టిస్తోంది. కాగా రీసెంట్ గా అతుల్య మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. ఈ క్రమంలోనే మీటర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి తెలిపారు. చిత్రబృందం మొత్తానికి ముందస్తు అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అతుల్య ..చిరంజీవి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న ఫొటోలు వైర‌ల్ గా మారాయి. చిరంజీవి లుక్ అయితే అదిరిపోయింది. చెవికి పోగుతో డిఫరెంట్ స్టైల్ లో కనిపించారు.ఎల్లో కలర్ షర్టులో చిరంజీవి మెరిసిపోతుండగా… మెరూన్ కలర్ టాప్ విత్ స్కట్ లో అతుల్య కూడా చాలా అందంగా కనిపించింది. ఇద్దరూ కలిసి ఫొటోకు ఫోజులు ఇవ్వగా..చక్కగా నవ్వుతూ కనిపించారు. ఈ చిత్రానికి నూతన డైరెక్టర్ రమేష్ కడూరి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. రొమాంటిక్ టచ్ తో కూడిన యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement