Saturday, April 27, 2024

నా కెరీర్ లో హైయ్యేస్ట్ బ‌డ్జెట్ సినిమా – అల్ల‌రి న‌రేష్

‘నాంది’ చిత్రంతో కమర్షియల్‌ హిట్‌ సాధించిన అల్లరి నరేష్‌, విజయ్‌ కనకమేడల తదుపరి చిత్రం ‘ఉగ్రం’. అల్లరి నరేష్‌ ని పోలీస్‌ గా చూపించిన ఉగ్రం టీ-జర్‌ కి మంచి స్పందన వచ్చింది.
శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ సింగిల్‌ ”దేవేరి…. ” పాటని చిత్ర బృందం విడుదల చేసింది.
సాంగ్‌ ఆవిష్కరణ వేడుకలో అల్లరి నరేష్‌ మాట్లాడు తూ ”ప్రేక్షకులకు నచ్చితే అన్ని రకాల పాత్రలని చూస్తారు. ఉగ్రం సినిమాని చాలా ఇష్టపడి కష్టపడి చేశాం. దేవేరి పాట రాసిన శ్రీమణి గారికి పాడిన అనురాగ్‌ కులకర్ణి గారికి థాంక్స్‌. శ్రీ చరణ్‌ చాలా బ్యూటీ-ఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. విజయ్‌ మాస్టర్‌ చక్కని కొరియోగ్రఫీ చేశారు. నిర్మాత సాహు గార పాటి, హరీష్‌ పెద్ది గారి కృతజ్ఞతలు. నా కెరీర్‌ లో ఉగ్రం హయ్యెస్ట్‌ బడ్జెట్‌ చిత్రం. అన్నారు

YouTube video

విజయ్‌ కనకమేడల మాట్లా డుతూ ” ఉగ్రం నరేష్‌ గారికి మరో డిఫరెంట్‌ ఫిల్మ్‌ కాబోతుంది. అని చెప్పారు.
శ్రీచరణ్‌ పాకాల మాట్లాడుతూ.. దేవేరి ఉగ్రం నుంచి మొద టి మెలోడి. చాలా డిఫరెంట్‌ మూవీ. సౌండింగ్‌ కూడా చాలా డిఫరెంట్‌ గా వుంటు-ంది. ” అన్నారు. నిర్మాతలు, తూము వెంకట్‌, విజయ్‌ మాస్టర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘ ఉగ్రం’ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్‌ పెద్ది గ్రాండ్‌ గా నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement