Monday, April 29, 2024

సినీ న‌టి అసిస్టెంట్ కి లాట‌రీలో రూ.10కోట్లు

అదృష్టం ఎప్పుడు ఎవ‌రి త‌లుపుత‌డుతుందో చెప్ప‌లేం. అదే జ‌రిగింది ఆల్బ‌ర్ట్ టిగా విష‌యంలో. సినీ నటి రజనీ చాందీ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆల్బర్ట్ టిగాను అదృష్ట దేవత వరించింది. లాట‌రీలో రూ. 10కోట్లు గెలుచుకున్నాడు. ఎస్ బిఐ అలువా బ్రాంచ్‌లో బహుమతి గెలుచుకున్న టికెట్ ను అతను వారికి అంద‌జేశాడు.నటి రజనీ చాందీ భర్త చాందీ వచ్చి బహుమతి గెలుచుకున్న టిక్కెట్‌ను ఆల్బర్ట్ బ్యాంక్ మేనేజర్ గీవర్గీస్ పీటర్‌కు అందజేశారు. ఆల్బర్ట్ 1995లో పని వెతుక్కుంటూ అసోం నుంచి కేరళకు వచ్చాడు. అతనికి లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే SE 222282 టిక్కెట్‌ కొన్నాడు. అయితే, ఈ సారి ఈ టికెట్ అతనికి అదృష్టాన్ని తీసుకొచ్చింది.

సమ్మర్ బంపర్ బీఆర్ 90లాటరీ’ విడుదల చేసిన ఫలితాల్లో మొదటి బహుమతి 10 కోట్లు బంపర్ లాటరీ తగిలింది. కేరళ రాష్ట్ర లాటరీ విభాగం నిన్న సమ్మర్ బంపర్ బీఆర్ 90 ఫలితాన్ని ప్రకటించింది. తిరువనంతపురంలోని గోర్కీ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ డ్రా జరిగింది. మొదటి బహుమతి పది కోట్లు. రెండవ బహుమతి టికెట్ నంబర్ ఎస్ బి 152330కి లభించింది. ఎర్నాకులంలో విక్రయించిన టిక్కెట్‌లకు మొదటి బహుమతి, రెండవ బహుమతి లభించాయి.రెండో బహుమతి రూ.50 లక్షలు. మూడో బహుమతి ఐదు లక్షలు. నాల్గవ బహుమతి విజేతకు లక్ష రూపాయలు కూడా అందుతాయి. ఐదవ బహుమతి ఐదు వేల రూపాయలు. ఆరో బహుమతి రూ.2,000. ఏడో బహుమతి రూ.1,000. ఎనిమిదో బహుమతికి రూ.500 కూడా లభిస్తుంది. టికెట్ ధర 250 రూపాయలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement