Thursday, March 28, 2024

లోకేష్ తో కొత్త ఎమ్మెల్సీల భేటీ..

అనంతపురం, మార్చి 21 : పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా విజయం సాధించిన రాం గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ. చిరంజీవి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సత్య సాయి జిల్లా కదిరి ఆర్డీవో కార్యాలయం వద్ద ఉన్న విడిది కేంద్రంలో కలిసి పలు విషయాలను చర్చించారు. ఈసంద‌ర్భంగా ముగ్గురు ఎమ్మెల్సీలకు లోకేష్ శాలువా కప్పి సన్మానించారు. వైసీపీ అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన మీరు రియల్ హీరోలు అని అభినందించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. వెనక్కి తగ్గకుండా సైకో పాలనపై మీరు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై మండలి లో గళం వినిపించాలని అన్నారు. మాపై ముందు నమ్మకం పెట్టుకొని సీటు ఇచ్చిన మీకే మా గెలుపును అంకితం చేస్తున్నామ‌ని కంచర్ల శ్రీకాంత్, రాం గోపాల్ రెడ్డి, లోకేష్ తెలిపారు. 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం మీ డైరక్షన్ లో పనిచేస్తామ‌ని హామీ ఇచ్చారు.


ముస్లిం బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను చూపిస్తున్న లోకేష్ :
కేవలం ముస్లిం, మైనారిటీ బాలికల కోసం కదిరిలోని సీపీఐ కాలనీ వద్ద ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్ (గురుకుల పాఠశాల) నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం రూ.17కోట్లకు పైచిలుకు నిధులను కేటాయించింది. నిధులు కేటాయించిన వెంటనే పనులు ప్రారంభించి 80శాతం మేర పూర్తి చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కేలవం ఇరవై శాతం మిగిలిన పనులు పూర్తి చేసింది.. అయినా పేరు చంద్రబాబుకు వస్తుందని, దాన్ని ఇప్పటికీ ప్రారంభించకుండా అలానే వదిలేశారు. అలాగే 2 ఏళ్లుగా పాలిటెక్నీక్ కళాశాల నిర్మాణం నిలిచిపోయింది.. అయితే కదిరిలో.. ముస్లిం బాలికల రెసిడెన్షియల్ పాఠశాల భవనాల నిర్మాణ దశను నారా లోకేష్ సెల్ఫీ తీసి చూపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement