Monday, May 13, 2024

ఆదిపురుష్ – పాన్ ఇండియా కాదు పాన్ వ‌రల్డ్..

‘బాహుబలి’ తెచ్చిన ఖ్యాతి సామాన్యమైనది కాదు. ప్రాంతీయ సినిమాను ఖండాంతరాలు దాటించింది. తెలుగు హీరోను ఉన్నత శిఖరంలో నిలబెట్టింది. బాహుబలిలో నటించిన ప్రభాస్‌ స్థాయి పెరిగింది. ఇప్పుడు ఆయనతో సినిమా అంటే మామూలు విషయం కాదు. వందలకోట్ల బడ్జెట్‌ అంతేకాదు అంతర్జాతీయంగా మార్కె టింగ్‌. దీనివల్ల ప్రభాస్‌తో కొత్త కొత్త ప్రయోగాలు చేసేందుకు క్రియేటర్స్‌కు అవకాశం దొరికింది. ఇప్పుడు ప్రభాస్‌ నటిస్తున్నవన్నీ పాన్‌ ఇండియా సినిమాలే. సినిమా సినిమాకు బడ్జెట్‌ పెరుగుతోం ది. నిర్మాణంలో ఉన్న ఆదిపురుష్‌ సినిమాకు సుమారు ఐదు వందల కోట్ల వెచ్చిస్తున్నట్టు నిర్మాత భూషన్‌ కుమార్‌ ఇప్పటికే ప్రకటించారు.

పైగా ఈ సినిమాను పాన్‌ ఇండియానే కాదు పాన్‌ వరల్డ్‌గా విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు.
‘ఆదిపురుష్‌’ సినిమా ఆంగ్లంలో కూడా విడుదలవుతుంది. ఇందుకోసం ఇంటర్నేషనల్‌ స్టూడియోస్‌తో ఒప్పందం అవుతున్నట్టు తెలిపా రు. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌ శ్రీరాముడిగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభించారు. రావణాసురుడిగా సైఫ్‌ అలీఖాన్‌, సీతగా కృతిసనన్‌ నటిస్తున్నారు. మేకర్స్‌ ప్రకటించినట్టు 2023లో జనవరి 12న ఆదిపురుష్‌ విడుదలవుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement