Thursday, May 16, 2024

ది వారియ‌ర్ నుండి – ద‌డ ద‌డ మ‌ని లిరిక‌ల్ వీడియో సాంగ్

ది వారియ‌ర్ చిత్రం నుండి ద‌డ ద‌డ మ‌ని లిరిక‌ల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. త‌మిళ ద‌ర్శ‌కుడు ఎన్‌.లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుగుతున్నాయి.ద్విభాష చిత్రంగా తెర‌కెక్కిన ఈ సినిమా జూలై 14న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల కానుంది.. శ్రీమ‌ణి సాహిత్యం అందించిన ఈ పాట‌ను హ‌రిచ‌ర‌ణ్ అద్భుతంగా ఆల‌పించాడు. దేవీ శ్రీ ప్ర‌సాద్ మ‌రో మెలోడీ ట్యూన్‌తో ప్రేక్ష‌కుల‌ను మాయ చేశాడు. సుజిత్ వాసుదేవ్ కెమెరా విజువ‌ల్స్ బాగున్నాయి. హీరో రామ్,కృతి శెట్టి మ‌ధ్య కెమిస్ట్రీ చ‌క్క‌గా కుదిరింది. ఇదివ‌ర‌కే చిత్రం నుంచి విడుద‌లైన ‘బుల్లెట్’ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ పాట నాలుగున్న‌ర కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీనివాస్ చిట్టూరీ నిర్మిస్తున్నాడు. రామ్‌కు జోడీగా కృతిశెట్టి నటించ‌గా, ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో ఆది పినిశెట్టి న‌టించాడు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement