Saturday, April 27, 2024

ఊరంత కుటుంబం..12 మంది భార్య‌లు,102 మంది పిల్ల‌లు

బుటాలేజా(ఉగాండా): 12 మంది భార్యలు..102 పిల్లలు.. ఇక 578 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. తన పిల్లల పేర్లలో చాలా పేర్లు అతనికి తెలియదు. ఇది విచిత్రంగా ఉంది కదూ..? అవును.. ఇది నిజం. ఉంగాండాలోని బుటాలేజా ప్రాంతంలో నివసించే మూసా హసహ్య కసెరా కథ ఇది. మొదట్లో ఎక్కువ ఎక్కువమంది భార్యలు, సంతానం, మనవళ్లు ఉన్నారనే విషయం చాలా సరదాగా ఉండేది. కాని ఇది ప్రస్తుతం నాకు పెద్ద సమస్యగా ఉంది. నా ఆరోగ్యం క్షీణించింది.. ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించాలంటే మాటలు కాదు. సరైన ఆహారం, విద్య, దుస్తులు వంటి ప్రాథమిక వస్తువులను సైతం ఇవ్వలేకపోతున్నానని మూసా వాపోతున్నాడు. సరిగా పోషించడం లేదని ఇద్దరు భార్యలు విడిచిపోయారని చెప్పాడు.

ప్రస్తుతం ఇతను నిరుద్యోగి.. ఎలాంటి ఆదాయం లేదు. అయితే, మూసా ఇప్పుడు తన గ్రామంలో సెలబ్రిటీగా మారాడు. ఇప్పుడు భార్యలు బర్త్‌ కంట్రోల్‌ను పాటిస్తున్నాని మీడియాకు తెలిపాడు. బుగిసా గ్రామంలో మూసా తన కుటుంబంతో నివాసముండే ఇల్లు ప్రస్తుతం శిధిలావస్థకు చేరుకుంది. పెచ్చులు ఊడిపోయిన పైకప్పు, తుప్పు పట్టిన ఇనుప గేట్లు.. చుట్టపక్కలా దట్టంగా విస్తరించిన దట్టమైన పొదళ్లతో ఉంది. తన మొదటి భార్యను మూసా 1972లో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నాడని మీడియాకు తెలిపాడు. అప్పుడు వారిద్దరికి 17 ఏళ్లు. ఏడాది తర్వాత తమ ప్రథమ సంతానం సాండ్రా నాబ్‌వైర్‌ జన్మించాడు. నా కుటుంబ వారసత్వాన్ని విస్తరించడానికి చాలా మంది పిల్లలను కనాలని, అందుకు చాలా మంది భార్యలను పెళ్లాడాలని తన బంధుమిత్రులు సలహా ఇవ్వడంతో ఈ కార్యాన్ని ప్రారంభించానని మూసా వెల్లడించాడు.

యుక్త వయసులో మూసా హసహ్య పశువులు, మాంసాన్ని విక్రయించే వ్యాపారం చేసేవాడు. ఉంగాండాలో 1955లో బాల్య వివాహాలు మాత్రమే నిషేధించారు. అయితే, తూర్పు ఆఫ్రికా దేశాల్లో కొన్ని మత సంప్రదాయాల ప్రకారం బహుభార్యత్వానికి అనుమతి ఉంది. 102 మంది సంతానంలో 10 నుంచి 50 ఏళ్ల వయసు వాళ్లు ఉన్నారు. ఇతని చిన్న భార్య వయసు 35 ఏళ్లు. నా పిల్లల పేర్లును గుర్తించడంలో నా భార్యలు అంటే పిల్లల తల్లులు సహాయపడతారని అంటాడితను. అంతే కాదు మూసాకు చాలా మంది భార్యల పేర్లు కూడా గుర్తులేవు. అలాంటప్పుడు అతను తన పిల్లలను అడిగి తెలుసుకుంటాడట. తన సంతానంలోని విద్యను అభ్యసించిన కొద్దిమందిలో 30 ఏళ్ల షాబాన్‌ మగినో ఒకడు. ఇతను స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. తన భార్యలు తనని ప్రేమిస్తారని అందుకే ఇంకా తనతో పాటే ఉంటున్నారని అంటాడు మూసా హసహ్య కసెరా.

Advertisement

తాజా వార్తలు

Advertisement