Sunday, May 12, 2024

తెలంగాణలో కొత్తగా 1175 కేసులు @టుడే అప్డేట్ !!

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1175 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరోవైపు 10 మంది కరోనా తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,771 మంది కరోనా నుంచి పూర్తిగా కొలుకున్నారు.

తాజా గణాంకాల ప్రకారం మొత్తం నమోదు అయిన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,15,574కు చేరింది. అలాగే డిశ్చార్జ్ అయిన కేసుల సంఖ్య… 5,95,348కు చేరింది. అలాగే మృతుల సంఖ్య 3,586కు చేరింది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 16,640 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement