Sunday, April 28, 2024

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న శృతిహాసన్ !! సలార్ లో మాములుగా ఉండదు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే సలార్ సినిమా షూటింగ్ ని కూడా స్టార్ట్ చేయడానికి జూలైలో ముహూర్తం ఫిక్స్ చేశారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్ కొన్ని యాక్షన్ సన్నివేశాలలో నటించాల్సి ఉందట. దానికోసం ముంబైలో నిపుణుల సమక్షంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుందట. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ లో శృతి హసన్ సలార్ సెట్ లో జాయిన్ అవుతుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement