Sunday, April 28, 2024

మొత్తం సెట్ వర్క్ తోనే ‘రాధే శ్యామ్’ ఆదరగొడుతుందట!!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇది వరకే ఈ సినిమాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు సెట్ వర్క్ కూడా ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.

కాగా ఈ చిత్రంలో 26 సెట్టింగ్స్ కనిపిస్తాయట. కేవలం ఈసెట్ వరకు కోసమే మేకర్ ఏకంగా వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టారట. దీన్ని బట్టే ఈ లవ్ స్టోరీ బ్యాక్ గ్రౌండ్ లో ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఇప్పుడు ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement