Wednesday, May 8, 2024

Meta vs Twitter | ఏడు గంటల్లో ’10 మిలియన్’ సైన్-అప్‌లు.. ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్ రికార్డ్

సోషల్ మీడియా ప్ర‌పంచంలో మ‌రో కొత్త ప్లాట్ ప్లాట్‌ఫామ్ ఎంట్రీ ఇచ్చింది. ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ తన సరికొత్త ప్లాట్‌ఫారమ్, ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్ యాప్‌ను ఎలోన్ మస్క్ ట్విట్టర్‌కు ప్రత్యక్ష పోటీగా 100 దేశాలలో ఆవిష్కరించాడు. మైక్రోబ్లాగింగ్ రంగంలో ట్విట్టర్‌ను ఎదుర్కోవడానికి ఈ సాహసోపేతమైన చర్య సోషల్ మీడియా రంగంలో కొత్త పోటీని రేకెత్తిస్తోంది. కాగా, ఈ యాప్ Android & iOS పరికరాలలో అందుబాటులో ఉంది.

అయితే ఈ యాప్ లాంచ్ చేసిన‌ మొదటి ఏడు గంటల్లో 10 మిలియన్ల సైన్-అప్‌లను నమోదు చేసినట్లు కంపెనీ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ ఇవ్వాల (గురువారం) త్రెడ్స్ యాప్ లో పోస్ట్ ద్వారా తెలిపారు. థ్రెడ్స్ యాప్‌లో లాగిన్ అవ్వాలి అనుకునే వినియోగదారులు తమ ఇన్‌స్టాగ్రామ్ ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేసుకోవ‌చ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement