Friday, April 26, 2024

మాస్కు పెట్టకోమన్నందుకు మొహంపై దగ్గిన యువతి

మాస్క్​ పెట్టుకో అన్నందుకు.. ఊబెర్​ డ్రైవర్​ మొహంపై ప్రయాణికురాలు దగ్గిన సంఘటన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. శుభకర్ ఖేడ్కా అనే ఓ నేపాలీ డ్రైవర్ కు ఎదురైంది ఈ అనుభవం.బెర్ అండ్ లిఫ్ట్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న శుభకర్ ఆర్డర్ మేరకు ముగ్గురు మహిళలను పిక్అప్ చేసుకున్నాడు. అయితే వారికి మాస్కు లేకపోవడంతో పెట్టుకోవాలని సూచించాడు. వారిదగ్గర మాస్కులు లేకపోవడంతో కారును పెట్రోల్ బంక్ వద్ద ఆపి మాస్కులు కొనుక్కోవాలని సలహ ఇచ్చాడు. ఒకరు మాస్కు కోసం వెళ్లగా మరో యువతి మాత్రం డ్రైవర్ తో గొడవకు దిగింది. శుభకర్ ని పై విరుచుకుపడింది. అంతటితో ఆగకుండా డ్రైవర్ పై దగ్గింది. మాకు కరోనా ఉంది ఇప్పుడు నువ్ ఏం చేస్తావ్ అన్నట్లు మాట్లాడారు. ఇదంతా మరో మహిళా తన సెల్ ఫోన్ రికార్డ్ చేసింది.

మహిళల అనుచిత ప్రవర్తనతో విసిగిపోయిన డ్రైవర్ ఇంతటితో డ్రైవింగ్ ఎండ్ చేస్తున్నాని మీరు కారు నుంచి దిగిపోవాలన్నాడు. దానికి వారు నిరాకరించి మంరిత హంగామా చేశారు. అంతే కాదు శభకర్ కళ్లలో ఓ స్ప్రేను చల్లి వెళ్లారు. దీంతో ఊపిరాడక అతడు ఇబ్బంది పడ్డాడు. ఆ స్ప్రే వల్ల కారు పాడైందని అతడు చెప్పాడు. ఈ ఘటనంతా కారు కెమెరాలో రికార్డ్ కావడంతో అసలు విషయం బయటకొచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన సదురు యువతీ అతడు కేవలం క్రాప్ చేసిన 40 సెకన్ల వీడియోనే ఎందుకు న్యూస్ చానెళ్లకు ఇచ్చాడో గుర్తించాలని కోరింది. తాను గొడవకు ముందు జరిగిన విషయాలను వెల్లడించలేనని తెలిపింది.

https://twitter.com/davenewworld_2/status/1369327881265020937?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1369327881265020937%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2Fdavenewworld_22Fstatus2F1369327881265020937widget%3DTweet
Advertisement

తాజా వార్తలు

Advertisement