Monday, May 13, 2024

ఐపీఎల్‌2021: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది

క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఐపీఎల్ 2021 షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. మొదటి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఏప్రిల్ 9న చెన్నై వేదికగా జరగనుంది. కరోనా నేపథ్యంలో కేవలం ఆరు స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించనున్నారు. ఇటీవలే ప్రారంభమైన నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్)తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఈ ఏడాది హైదరాబాద్‌ లో ఇక ఐపీఎల్‌ మ్యాచ్‌ లు లేనట్లే.

మ్యాచ్‌ ల తేదిల వివరాలు ఇలా ఉన్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement