Tuesday, May 14, 2024

నేటి సంపాదకీయం-రాష్ట్రపతి పదవిపై చర్చలు..

మరో నాలుగు నెలల్లో ఖాళీ కానున్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవుల గురించి అనేక మంది రాజ కీయ దిగ్గజాలు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఐదు సంవత్సరాల కిందట ప్రధాని నరేంద్ర మోడీ ప్రాంతా లకు, సామాజిక వర్గాలకు సమతుల్యత పాటించాలని ఉత్త ర భారత దేశం నుంచి దళిత మేధావి అయిన రామ్‌నాథ్‌ కోవింద్‌కు రాష్ట్రపతిగా, దక్షిణ భారత దేశం నుంచి రాజ కీయ నాయకునిగానే కాకుండా, రాజనీతిజ్ఞునిగా, సామా జిక మేధావిగా, సాహితీ వేత్తగా పేరు గాంచిన వెంకయ్య నాయుడుకు అవకాశం కల్పించారు. ఈసారి ఈ అత్యున్నత పదవులు ఎవరికి లభిస్తాయోనని అధికారికి బీజేపీ నాయ కులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. స్వాతం త్య్రానంతరం రెండు పర్యాయాలు వరుసగా రాజేంద్ర ప్రసాద్‌ రాష్ట్రపతిగా కొనసాగారు. ఆ తరువాత కొనసాగిన వారందరూ ఒక పర్యాయం (ఐదు సంవత్సరాలు) మాత్రమే పదవులలో ఉన్నారు.

ఈసారి కూడా మళ్లీ రామ్‌నాథ్‌ కోవింద్‌కే అవకాశం కల్పిస్తారనే చర్చ కొనసాగు తున్నప్పటికీ అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నా యని చెప్పవచ్చు. ఈ పర్యాయం దక్షిణ భారత దేశానికి ప్రాధాన్యతతో పాటు ఓబీసీల కోటా కింద పరిశీలించవచ్చు నని చెబుతున్నారు. హర్యానా గవర్నర్‌గా కొనసాగుతున్న బండారు దత్తాత్రేయ పేరు పరిశీలనకురానున్నట్లు ఢిల్లీ అధి కార లాబీల్లో వినవస్తోంది. దత్తాత్రేయకు అవకాశం కల్పిం చడం ద్వారా వివాద రహితుడికి అత్యున్నత పదవిని ఇచ్చిన ట్లవుతుందన్న విశ్లేషణతోపాటు, దక్షిణాది సీనియర్‌ నేతకు సముచిత గౌరవం కల్పించిన పేరుని నిలబెట్టుకున్నట్లవు తుందని కమలనాథులు భావిస్తున్నారు. దత్తాత్రేయ సామా జిక వర్గం కర్నాటకలో ఎక్కువగా ఉన్నందున వచ్చే ఏడాది కర్నాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలిసింది. ఇలాగే.. ఉత్తరప్రదేశ్‌లో యాదవులు, జాట్‌లు తరువాత కూర్మీలు బలమైన వర్గంగా రాణిస్తున్నారు. ఆంధ్రా, తెలం గాణ, కర్నాటకలలో కురుమలుగా పిలువబడుతున్నవారు యూపీలో కూర్మీలుగా రాణిస్తున్నారు.

దేశ రాజకీయాలకు అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ కీలకంగా మారినందున ఈ విధంగా కూడా దత్తాత్రేయ వైపు మోడీ చూపు మళ్లిందని చెబుతున్నారు. దత్తాత్రేయ ఊహ తెలిసినప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో రాణించి, ఆ తరువాత జన సంఘ్‌, అనంతరం బీజేపీ పార్టీతో మానసికంగా విడదీ యరాని బంధంతో వ్యవహరిస్తున్నారు. ఆజాత శత్రువు, మృదుభాషి, నిరాడంబరుడు, అన్ని వర్గాల మన్ననలు పొందిన ఆయనకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని మోడీకి ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలతో పాటు కేంద్ర నిఘా వర్గాలు సైతం అనుకూలంగా నివేదికలు ఇచ్చినట్లు చర్చ జరుగుతున్నది. ఇదే విధంగా మైనార్టీలు కూడా బీజేపీకి ఆప్తులు, ఆత్మీయులు అనే సంకేతం తెలియజేయడంలో భాగంగా గత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో సైంటిస్టు అయిన మేధావి అబ్దుల్‌ కలామ్‌ను రాష్ట్రపతిగా ఎంపిక చేశారు.

ఈ సారి రాజకీయ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడైన గులామ్‌ నబీ ఆజాద్‌ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల గులామ్‌ నబీ ఆజాద్‌ను పద్మ అవార్డుకు ఎంపిక చేశారు. నిజంగా బండారు దత్తాత్రేయకు రాష్ట్రపతిగా అవకా శం లభిస్తే.. నీలం సంజీవరెడ్డి తరువాత మరో తెలుగు బిడ్డ అత్యున్నత పీఠం మీద రాణించిన నేతగా చరిత్రకెక్కుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement