Saturday, May 4, 2024

తీగల వంతెనంటే ఎంత నిర్లక్ష్యం!

గుజరాత్‌లో మోర్బీ వద్ద తీగల వంతెన కూలిన దుర్ఘటన ఇటీవలి చరిత్రలో కనీవినీ ఎరుగనిది. మోర్బీ ఒక జిల్లా కేంద్రం . 2013లో మోర్బీని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. సౌరాష్ట్రంలో ఉంది. బ్రిటిష్‌ కాలం నాటి ఈ వంతెనకు ఇటీవల మర్మత్తులు చేసి కొద్ది రోజుల క్రితమే రాకపోకలకు అనుమతించారు. ఈ వంతెనకు పూర్తిస్థాయిలో మరమత్తులు జరగకుండానే ట్రాఫిక్‌కి అనుమతించారన్న ఆరోపణలున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం వల్ల యావద్దేశం దృష్టి ఈ ఘటనపై కేంద్రీకృతమై ఉంది. దేశంలో ఇలాంటి పాత వంతెనలు చాలా ఉన్నాయి. రాజమహేంద్ర వరం వద్ద సర్‌ ఆర్థర్‌ కాటన్‌ హయాంనాటి పటిష్టమైన పురాతన కట్టడం రైలు వంతెన విషయంలోనే వరదలు వచ్చినప్పుడు భయాందోళనలు వ్యక్తమవుతుంటాయి. అలాంటిది, ఇది తీగల వంతెన అతిసున్నితమైనది. అయినప్పుడు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది!. ఒకసారి వంద మందిని మాత్రమే అనుమతించగల వంతెనపైకి ఐదు వందల మందిని అనుమతించడం నేరమే. అంతే కాకుండా మనిషికి రూ.17 ల వంతన టికెట్‌ వసూలు చేశారంటే సంపాదన యావ స్పష్టంగాకనిపిస్తోంది. ఇంతమందిని అనుమతిస్తే ఇలాంటి దుర్ఘటనలు జరగ డంలో ఆశ్చర్యం లేదు. పాత వంతెనలపై రైళ్ళు,ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించకముందే కొత్త వంతెనల నిర్మాణం చాలా చోట్ల జరుగుతున్నాయి. మూర్బీ వంతెనకు కూడా అదే రీతిలో గుజరాత్‌ మరమ్మత్తులు చేయించింది.

అయితే, అవి పూర్తి స్థాయిలో, సంతృప్తికరంగా జరగలే దంటున్నారు. ఈ దుర్ఘటనకు తమదే బాధ్యత అని రాష్ట్ర మంత్రి బ్రజేష్‌ మీర్జా అంగీకరించారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు.సర్దార్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు తాను కేవేడియాలో ఉన్నా,తన మనసంతా ఈ దుర్ఘటన ప్రదేశంపైనే ఉందని అన్నారు.ఈ దుర్ఘటనలో మరణించి న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారం కాకుండా, మృతుల కుటుంబాలకు రెండేసి లక్షల వంతున సాయా న్ని ప్రధానమంత్రి నిధి ద్వారా ప్రకటించారు.ఈ వంతెన పై వందమందిని మాత్రమే అనుమతించాల్సి ఉండగా, ఐదారు వందల మంది తోసుకుని రావడం,అక్కడ భద్రతా సిబ్బంది వారిని ఆపలేకపోవడం ముఖ్యకార ణంగా ప్రాథమిక విచారణలో తేలింది.అంతేకాక, కొంద రు ఈ వంతెన ఎక్కి ఆకతాయిగా, వినోదంగా రెయిలిం గ్స్‌ని పట్టుకుని ఊగడం వల్ల ఒక్కసారిగా ఈ వంతెన కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.ఈ వంతెన కాలిబాటగా ఉపయోగించుకోవడానికి మాత్ర మే పర్యాటక వినోదంగా దీనిని భావించడం క్షమించరాని నేరం.

అయితే, ప్రధానమంత్రి మంగళవారం నాడుఈ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత వాస్తవ విషయాలు వెలుగులోకి రావచ్చని భావిస్తున్నారు.మూర్బీ జిల్లాని ఏర్పాటు చేయడంలో మోడీ కృషి ఉంది.2013లో ఏర్పా టైన ఈ జిల్లాని వాణిజ్యపరంగా,పారిశ్రామికంగా వృద్ధి చేయడమే లక్ష్యంగా మోడీపలు పథకాలను అమలు జేశారు. సౌరాష్ట్రలోని కొన్ని ప్రాంతాలనూ, జామ్‌ నగర్‌, రాజ్‌కోట్‌ లోని ప్రాంతాలను కలిపి ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ జిల్లా రెండు పెను విషాదాలను తట్టుకుంది. 2000లో సంభవించిన భూకంపంలో పలు ఆనకట్టలు బీటలు తీశాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. మచ్చు నది ఆనకట్ట పేలిపోయింది. మోర్బీ ప్రాంతాన్ని మొగలాయి ల నుండి రాజపుట్‌ల వరకూ పలు రాజవంశాలు పాలిం చాయి. ఈ ప్రాంతంలో పాడిపంటలకు లోటులేదు. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఈ ప్రాంతం తట్టుకుని నిలబడింది. పారిశ్రామికంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది.ఈ జిల్లాలో సెరామిక్‌,గోడ గడియారాల తయారీకి ప్రసిద్ధి.ఈ ప్రాంతంలో పురాతన కట్టడాలు ఎన్నో కనిపిస్తాయి.అలాగే, పాత రాజవంశీయు లు నిర్మించిన విద్యా సంస్థలు ఇప్పటికీ పని చేస్తున్నాయి. మోర్బీ అభివృద్ధి చెందిన జిల్లాగా పేరొందింది. అక్షరాస్య తలో ముందుంది.

- Advertisement -

నవతరం ప్రతినిధులు దేశంలో వస్తు న్న మార్పులకు ప్రభావితం అవుతున్నారు. తీగల వంతె న ఎంతో సున్నితమైనది. దానిని కేవలం నడక కోసమే ఉపయోగించాలి.అటువంటి వంతెనపై దూసుకుని వెళ్లడం, తీగలు పట్టుకుని కుదపడం దారుణమే. అయి తే, ఈ వంతెన మరమ్మత్తులను హడావుడిగా పూర్తి చేశారనీ, అవినీతి చోటు చేసుకుందని చెబుతున్నారు. ఏమైనా ఇలాంటి మౌలిక సదుపాయాల పట్ల అలసత్వా న్ని ప్రదర్శించి ఉంటే అది క్షమించరాని నేరమే. అంతే కాదు, ఇది మానవ తప్పిదమన్న విషయం ప్రత్యక్ష సాక్షు ల కథనాలను బట్టి స్పష్టమవుతోంది. పురాతన కట్టడాల పై ఏ ప్రభుత్వమైనా అలసత్వం ప్రదర్శించడం సరికాదని ఇలాంటి సంఘటనలు రుజువnు చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement