Thursday, April 25, 2024

వారసుడు మూవీ సెట్ లో దిల్ రాజు కుమారుడు..ముద్దులాడిన హీరో విజయ్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమారుడిని చేతుల్లోకి తీసుకుని ముద్దాడాడు హీరో విజయ్. యాభై ఏళ్ల వయసులో దిల్ రాజు రెండో వివాహం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దిల్ రాజుకి ఈ ఏడాది కొడుకు పుట్టాడు. దీంతో దిల్ రాజు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దిల్ రాజు కొడుకు ఫోటోలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. వారసుడు చిత్ర సెట్స్ కి దిల్ రాజు తన కొడుకును తీసుకు రావడంతో విజయ్ పిల్లాడిని చేతుల్లోకి తీసుకొని ముద్దాడాడు. ఆ సమయంలో ఎవరో ఫోటో క్లిక్ మనిపించారు. సదరు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దిల్ రాజు కుమారుడిని చూసిన నెటిజెన్స్ సూపర్ క్యూట్ గా ఉన్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. తాజాగా దిల్ రాజు వారసుడు ఎలా ఉంటాడో రివీల్ అయ్యింది.
కోలీవుడ్ స్టార్ విజయ్ చేతుల్లో దిల్ రాజు కొడుకు దర్శనమిచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement