Monday, April 29, 2024

డిజిటల్‌ విజన్‌కు చేయూత

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈఓ నాదెళ్ళ సత్య మన దేశంలో నాలుగు రోజుల పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలుసుకున్న సందర్భంలో చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన వాగ్దానాలు మన దేశంలో సాఫ్ట్‌వేర్‌ రంగం మహోన్నత స్థితిని అద్దంలో చూపుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ రంగం భారత దేశంలో ప్రవేశానికి పునాది వేసి న వాడు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కాగా, మరో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈ రంగం ఎదుగుదలకు సంపూర్ణ సహకారాన్ని అందించారు. ఆ రోజుల్లో శాం పిట్రోడా వంటి కంప్యూటర్‌ నిపుణులను రాజీవ్‌ ప్రోత్స హించినప్పుడు కంప్యూటర్‌ బాయస్‌ అంటూ హేళన చేసిన వారే ఆ తర్వాత పాలనా రంగంలో కంప్యూటర్లను అనివార్యం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఎల్లెడలా విస్త రించడంతో కంప్యూటర్‌ వినియోగం పెరిగింది. సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్ల డిమాండ్‌ పెరిగింది. ఈ రంగంలో ఉద్యో గాలు వెల్లువలా పెరిగాయి. సరిగ్గా ఆ సమయంలోనే మన దేశంలో ఎంతోమంది కంప్యూటర్‌ నిపుణులు తయారయ్యారు. వారిలో సత్య నాదెళ్ళ ముఖ్యులు. ఆయన కంప్యూటర్‌ నిపుణునిగా అంచలంచెలుగా ఎదిగి ప్రపంచ విఖ్యాత సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ అధిపతి అయ్యారు. ఆయన తెలుగు వాడు కావడం మనందరికీ గర్వకారణమే కాదు, స్ఫూర్తిదాయకం.

ఈ రంగంలో మన దేశం ఎక్కువ పెట్టుబడులు పెడుతోంది. మన దేశం నుంచి సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు ఏటేటా పెరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో మొదటి పది దేశాల్లో భారత్‌ ఒకటి కావడం ముమ్మాటికీ గర్వకారణం. అంతేకాదు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లను తయారు చేయడంలో భారత్‌ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ సంస్థల కేంద్రమైన సిలికాన్‌ వ్యాలీని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు. అలాంటి సిలికాన్‌ వ్యాలీ మన బెంగళూరులో వెలసింది. అలాగే, హైదరా బాద్‌ కూడా సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమకు కేంద్రంగా తయారైం ది. వీటి సంఖ్య పెరగడంతో హైదరాబాద్‌లో ఓ ప్రాంతా నికి సైబరాబాద్‌ అనే పేరొచ్చింది. అనంతమైన ఈ రంగం లో ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. కొంగ్రొత్త గా నిపుణులు తయారవుతున్నారు. ఈ విషయమై మనం ఎంత ఆనందంతో పొంగిపోతున్నామో, ఇక్కడే సాఫ్ట్‌వేర్‌ నిపుణునిగా తయారై, ప్రపంచం గర్వించతగిన సంస్థకు నేతృత్వం వహిస్తున్న సత్య నాదెళ్ళకు ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం.

ప్రధానిని కలిసిన తర్వాత ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ చెప్పిన మాటలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ రంగంపై చేసే ఖర్చుకు అంతకు అంత ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది. ప్రధాని నరేంద్రమోడీ డిజిటల్‌ విజన్‌పై ఆయన ప్రశంసలు కురిపిస్తూ పూర్తి స్థాయిలో డిజిటల్‌ విజన్‌ను ప్రారంభించిన భారత్‌కి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. భారత్‌లో మైక్రో సాఫ్ట్‌ డేటా సెంటర్లు ఇప్పటికే మూడు పని చేస్తున్నాయి. మరో డేటా సెంటర్‌ని త్వరలో నెలకొల్పనున్నట్టు ఆయన చెప్పారు. ఇన్‌ఫ్రా ప్రొవైడర్‌గా భారత్‌కి సేవలందించేందుకు సిద్ధం గా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. మన దేశంలో సాఫ్ట్‌వే ర్‌ రంగానికి ఆదరణ బాగా పెరిగింది. పట్టణాల నుంచి మహానగరాల వరకూ సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు ఆదరణ లభిస్తోంది. సమ్మిళిత ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించడం అభినందనీయమని సత్యనాదెళ్ళ అన్నారు. సమ్మిళిత ఆర్థికవ్యవస్థ కోసమే దేశంలోని ఆర్థిక వేత్తలు చాలా కాలంగా పోరాడుతున్నారు. ఆర్థిక రంగం లో సాధించిన అభివృద్ది అన్ని రంగాల ప్రజలకు అందిం చడమే సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ లక్ష్యం. హైదరాబాద్‌లో నానాటికీ పెరుగుతున్న స్టార్టప్‌లు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.

- Advertisement -

2016లో కేవలం వెయ్యి స్టార్టప్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పుుడు 90వేల పై వరకూ పెరిగా యి. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో యువకులు, విద్యార్ధులు ఎంతోమంది దీనిపట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఎన్నో ఆవిష్కరణలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ సంస్థ కు సత్య నాదెళ్ల ప్రపంచ ఖ్యాతిని నిలబెట్టేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన హయాంలో ఈ సంస్థ మన దేశంలో ఎక్కువ శాఖలను ఏర్పాటు చేసి ఎంతో మంది యువకులకు ఉపాధి చేకూర్చగలరని ఆశిస్తున్నాం. సత్య నాదెళ్ళ ఎంత ఎత్తు ఎదిగినా తన మూలాలను మరిచి పోలేదనడానికి ఆయన ఇచ్చిన సమాధానాలే నిదర్శనం. బిర్యానీ దక్షిణాది వారి సంప్ర దాయానికి తగినది కాదనీ, దక్షిణాది వారు ఇడ్లీ, దోశవం టి అల్పాహారాలకే ప్రాధాన్య మిస్తారని చెబుతూ, తన మాటను కాదనడానికి ప్రయ త్నించిన విలేఖరితో తాను దక్షిణాది వాడినని సాధికారి కంగా ప్రకటించారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతినంటూ ఏనాడో రాయప్రోలు సుబ్బారావ ు రాసిన గీతాన్ని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement