Wednesday, March 27, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య ఇవ్వాల లాస్ట్ టీ20 మ్యాచ్ రాజ్ కోట్ లో జరగనుంది. సిరీస్ ఫలితం తేల్చే ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్ లో ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమమైంది. దాంతో ఈ మ్యాచ్ లో విజయంపై రెండు జట్లు కన్నేశాయి. కాగా, నేటి మ్యాచ్ కోసం టీమిండియాలో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. శ్రీలంక జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. భానుక రాజపక్స స్థానంలో ఆవిష్క ఫెర్నాండో తుది జట్టులోకి వచ్చాడు.

టీమిండియా…

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్ మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చహల్.

శ్రీలంక…

- Advertisement -

దసున్ షనక (కెప్టెన్), పత్తుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, ఆవిష్క ఫెర్నాండో, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, వనిందు హసరంగ, చామిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మధుశంక.

Advertisement

తాజా వార్తలు

Advertisement