Saturday, April 27, 2024

ధర్మం మర్మం – మార్గశిరమాస విశిష్టత

శంఖం చ పద్మంచ గదాం రథాంగం
మత్స్యంచ కూర్మం రచితం స్వదేహే |
కరోతి నిత్యం సుకృతస్య వృద్ధిం
పాపక్షయం జన్మ శతార్జితస్య ||

నారాయణాయుధైర్నిత్యం చిహ్నితం యస్య విగ్రహం |
పాపకోటి ప్రయుక్తస్య తస్య కిం కురుతే యమ: |

శంఖోద్ధారేచ యత్ప్రోక్తం వసతా కోటి జన్మభి: |
తత్ఫలం లభతే శంఖే ప్రత్యహం దక్షిణ భుజే ||

యత్ఫలం పుష్కరే ప్రోక్తం పుండరీకాక్ష దర్శనాత్‌ |
శంఖోపరికృతే పద్మే తత్ఫలం కోటి సమ్మితమ్‌ ||

వామే భుజే గదా యస్య లిఖితా దృశ్యతే కలౌ |
గ దాధరో గయా పుణ్యం ప్రత్యహం తస్య యచ్ఛతి ||
శంఖము, పద్మము, గద, చక్రము, మత్స్యము, కూర్మమును తన శరీరమున లిఖించినచో ప్రతినిత్యము సుకృతము వృద్ధిచెందును. నూరు జన్మలలో సంపాదించిన పాపము నశించును. నిత్యము నారాయణాయుధములతో శరీరమున చిహ్నించినచో కోటి పాపములున్ననూ అతనిని యముడేమి చేయును? శం ఖోద్ధార క్షేత్రమున కోటి జన్మలు నివసించి న కలుగు ఫలము దక్షిణ భుజమున శంఖమును చిహ్నించుకొనిన కలుగును. పుష్కరక్షేత్రమున పుండరీకాక్షుని దర్శించుట వలన కలుగు ఫలము శంఖముపై పద్మమును చిహ్నించినచో ఆ ఫలము కోటి రెట్లధికమగును. వామభుజమున గద లిఖించబడి కనబడుచున్నదో అతనికి గదాధరుడు ప్రతిదినము గయా పుణ్యమును ప్రసాదించును.

- Advertisement -

డా|| కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement