Saturday, April 27, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 21

21. రాజైదుష్కృతి( జెందె( జందురుడురారాజైకుబేరుండుదృ
గ్రాజీవమ్మునగాంచె దుఃఖము; కురుక్ష్మాపాలుడా మాటనే
యాజింగూలెసమస్తబంధువులతో, ఆ రాజశబ్దంబు ఛీ!
ఛీ! జన్మాంతరమందునొల్లనుజుమీ! శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!చందురుడు ్స చంద్రుడు, రాజు ్శ ఐ ్స రాజు అనిపిలిపించుకొనటం చేత, దుష్కృతిన్ ్స పాపాన్ని, చెందె ్స పొందాడు, కుబేరుండు ్స కుబేరుడు, రారాజై ్స యక్షులకు చక్రవర్తియై, దృక్ ్శ రాజీవమ్మునన్ ్స నయనమనే పద్మంలో, దుఃఖము ్స శోకాన్ని, కష్టాన్ని, కాంచె ్స పొందాడు, కురుక్ష్మాపాలుడు ్స దుర్యోధనుడు, ఆ మాటనే ్స రారాజు అనే మాట చేతనే, సమస్తబంధువులతో ్స అందరు చుట్టాలతోనూ, ఆజిన్ ్స యుద్ధంలో, కూలెన్ ్స పడిపోయాడు. ఛీ!ఛీ! ్స ధిక్!ధిక్!, ఆరాజ శబ్దంబు ్స ఆ రాజు అనే మాటని, జన్మాంతరము ్శ అందున్ ్సమఱొక జన్మ యందు కూడ, ఒల్లన్ ్స అంగీకరించను, కోరను, చుమీ! ్స సుమా!
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! చంద్రుడు పాపి అవటానికి ‘ రాజు’ అనే పేరు ఉండటమే కారణం. కుబేరుడు కంటి విషయంలో బాధ పొందటం కూడ ‘రారాజు’ (యక్షులకు రాజు) అనే బిరుదం వల్లనే . దుర్యోధనుడు సమస్త బంధుమిత్రులతోనూ యుద్ధంలో నశించటానికి కూడ ఆ ‘రారాజు’ అనే బిరుదాన్ని కాంక్షించటం వల్లనే. అటువంటి ‘రాజ’ శబ్దాన్ని మరుజన్మ మందు కూడ కోరను.
విశేషం: చంద్రుడు గురుపత్నిని అపహరించి పాపాన్ని మూటకట్టుకొన్నాడు. కుబేరుడు పార్వతిని దుర్బుద్ధితో చూచి, అ చూచిన కన్ను కోల్పోయాడు. దుర్యోధనుడి సంగతి తెలిసినదే. వీరంతా పాపులవటానికి కారణం వారు రాజ శబ్దవాచ్యులవటమేనని వారి కున్నసామాన్యధర్మాన్ని గుర్తించాడు ధూర్జటి. ధూర్జటికి ఉన్న రాజులపై గల రోతకి ఈ పద్యం పతాకస్థాయి. రాజు అవటం మాత్రమే కాదు ఆ పదం కూడా ఇష్టం లేదట!

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి

ఇది కూడా చ‌ద‌వండి : శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 20

Advertisement

తాజా వార్తలు

Advertisement