Monday, May 6, 2024

సాంప్రదాయ రీతిలోశ్రీ కల్యాణ వేంకటేశ్వరుని బ్రహ్మౌత్సవాలు

చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 10 నుండి 19వ తేదీ వరకు జరగనున్నాయి.
ఆలయ స్థలపురాణం ప్రకారం శ్రీనివాసుడు పద్మావతిని నారాయణవనంలో పరిణయం చేసుకున్న తర్వాత వెంక టేశ్వరస్వామి పద్మావతి సమేతుడై తిరుమల కొండకు బయలు దేరారు. శాస్త్ర ప్రకారం పెళ్లయిన దంపతులు ఆరు నెలల వర కు కొండ ఎక్కకూడదని, పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళకూడదని అగస్త్య మహర్షి చెప్పారట. దీంతో స్వామివారు దేవేరితో కలిసి అగస్త్య ఆశ్రమంలోనే ఆరునెలల పాటు విడిది చేశారట. ఆరు నెలల తర్వాత తిరుమల కొండకు పయనమైన స్వామివారు భక్తులకు రెండు వరాలను ప్రసరించారని పురాణాల కథనం. వివాహం కాని యువకులు ఈ ఆలయానికి వచ్చి స్వామివారికి కల్యాణం చేయించుకుని, వారు ఇచ్చే కంకణం చేతికి కట్టుకుంటే వివాహం జరుగుతుందని నమ్మకం.
ఇక్కడ వేంకటేశ్వరుని ఆలయం చాలా పెద్దది. విశాల మైనది. శ్రీవారి ప్రధానమూర్తి తిరుమలలో ఉన్న దానికంటే పెద్దది. తిరుమలలో జరిగే అన్ని పూజాదికాలు ఇక్కడ కూడా జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాం తంగా దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి మెట్టు ఇక్కడికి దగ్గరే. అక్కడి నుండే తిరుమల కొండపైకి మెట్లదారి ఉంది. ఇది చాలా దగ్గర దారి. తిరుపతి అలిపిరి నుండి ఉండే మెట్ల దారి కంటే ఇది చాలా దగ్గర. సుమారు గంట లోపలే తిరుమల కొండపైకి వెళ్లవచ్చు.
కొవిడ్‌ కారణంగా రెండు సంవత్సరాలు స్వామివారి వాహన సేవలు నిర్వహంచలేదు. ఈసారి పరిస్థితులు అంతా సాధారణ స్థాయికి చేరుకోవడంతో ఆలయ నాలుగు మాడ వీధుల్లో నిర్వహంచనున్నారు.
ఫిబ్రవరి 10వ తేదీ శుక్రవారం సాయంత్రం సేనాపతి ఉత్సవం అంకురార్పణ చేస్తారు. దానితో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. 11వ తేదీ శనివారం ఉదయం 8.40 నుంచి 9 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామికి తిరుమలలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తారో ఈ కళ్యాణ వేంకటేశ్వరుడికి కూడా ప్రతి రోజు ఉదయం 8 గంల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు.
12న ఉదయం చిన శేష వాహనం, సాయంత్రం హంస వాహనం; 13న సింహ వాహనం, ముత్యపు పందిరి వాహ నం, 14న కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం; 15న పల్లకీలో మోహనీ అవతారోత్సవం, సాయంత్రం గరుడ వాహనం; 16న హనుమద్‌ వాహనం, సాలకట్ల వసంతోత్స వం, సాయంత్రం గజ వాహనం; 17న ఉదయం సూర్య ప్రభ వాహనం, సాయంత్రం చంద్ర ప్రభ వాహనం; 18న ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వ వాహనం; 19న ఉదయం పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, అవభృతం, చక్ర స్నానం, సాయంత్రం తిరుచ్చి ఉత్సవం, ధ్వజావరోహణం నిర్వహంచ నున్నారు. ఈ ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్స వాలు ముగుస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement