Sunday, May 12, 2024

శివనామ విశిష్టత

”నా కార్తీక సమో మాస్యే కృతేన సమం యుగమ్‌
నా వేద సదృశం శాస్త్రం న తీర్థం గంగాయా సమమ్‌ !!”
అని స్కాంద పురాణంలో చెప్పబడింది. అంటే, కార్తిక మాసానికి సమానమైన మాసం, కృతయుగంతో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రము, గంగ వంటి నదీ లేవు అని.
ఈ మాసం అందుకే చాలా పవిత్రమైన మాసం. హరి- హరాదులిద్ధరికీ ప్రీతికరమైన మాంసం. శివాలయాల్లో ”హ రహర మహాదేవ! శంభోశంకర” అంటూ భక్తుల నినాదాలతో మారుమ్రోగుతూ ఉంటాయి. శివనామాలకు ఉన్న విశిష్టత ఏమిటి?
ఆ నామాలు స్తుతించి తరించిన వారెవరు? విషయాల ను మనం తెలుసుకుందాం. దీనివల్ల అంతర్ముఖంగా నామ జపం చేసినట్లే. భగవంతుని నామాలు శక్తియుక్తము. శుభ ప్రద ము, క్షేమకరము, మోక్షకరము.
” శివేతి నామ దావాగ్నే న్మహాపాతక పర్వతా: భస్మే!
భవంత్యనాయా సాత్సత్యం సత్యం న సంశయ:!!”
అంటే శివనామం అనే దావాగ్ని ఎదుట మహాపాపాలనే పర్వతాలను తేలికగా బూడిద చేసేస్తుంది. ఇది సత్యము. పాపా ల వలన కలిగే సర్వదు:ఖాలను, మన:క్లేశాన్ని నశింపచేసేది శివనామము ఒక్కటే! మనం మన పిల్లల అక్షరాభ్యాస సమ యంలో, పిల్లలచేత మొదటిగా ”ఓం నమ:శివాయ సిద్ధం న మ: ” అని దిద్దిస్తారు. ఓం అంటే ప్రణవం. సాక్షాత్తు పరమాత్మ నోటినుండి వెలువడిందే. మిగిలినది పంచాక్షరీ మంత్రం. ఒక రకంగా ఇవి బీజాక్షరాలు విద్యకు అధిదేవత సరస్వతి అయినా, శుభకరుడు, జ్ఞాన స్వరూపుడు, మంగళకరుడు అయిన శివుని నామం దిద్దించి పలికింప చేయడం వారి భవిష్యత్తుకు పునాది.
ధర్మరాజు శ్రీకృష్ణుని సందర్శించిన సందర్భంలో ఒక సారి ”కృష్ణా! వాసుదేవా! శివుని గురించి తపస్సు చేసి సంతా నాన్ని పొందావు కదా. ఆయన నామాల విశిష్టత నాకు వివరిం చమని కోరగా, కృష్ణుడు ధర్మరాజా! పరమేశ్వరుడుని పరిపూ ర్ణంగా భజించడం,, ఆయన నామాలు సంపూర్ణంగా తెలుసు కోవడం, నాకు గాని, బ్ర#హ్మకు గాని శక్యంకాదు.
అయినా, నాకు తెలుసున్నంతవరకు ఆ శంభుడి నామా ల విశేషం తెలుపుతున్నాను. అనలుడు ఇంద్రుడు ఆదిత్యులు వసువులు మరుత్తులు మున్నగుగాగల దేవతాస్వరూపుడైన శివుని నామాలను స్మరించడం వల్లకాని, వినడం వల్లకాని సక లాభీష్టాలు సిద్ధిస్తాయి.
భీకరత్వంచేతను పరాక్రమంచేతను- సృష్టి సమయంలో రోదనతో ఉండే #హరునకు ”రుద్రుడు” అనే పేరు వచ్చింది. దేవతలందరిచేత గొప్పగా ఆరాధింపబడుచున్నందువల్ల
”మహాదేవుడు”గా, సకల సత్కర్మలకు ఫలవంతమైన శుభాలను కలిగించే వాడు. కనుక ”శివుడు”గా, సుస్థిరమైన తేజస్సుతో ప్రకాశిస్తూ, ధ్యానయోగంలో కదలని స్థితిలో ఉన్నందున ”స్థాణుడు” అని, పొగ రంగువంటి జటాజూటం ధరించేవాడు. కనుక ఆయనకు ”ధూర్జటి” అనే నామం, కద లని- కదిలే సకల జీవరాశులు యొక్క స్వరూపాలు తనలోనే ఇముడ్చుకున్నందువల్ల ”బ#హురూపుడు”గా, త్రిపురాసుర సంహారం వల్ల గౌరీపతి శరీరం నుంచి” విశ్వులు” అనే దేవత లకు జన్మనిచ్చినవాడు కనుక ”విశ్వ రూపుడు”, జీవులు అన్నీ పశువులు. ఆ పశుపాలకుడు శివుడే కనుక ”పశుపతి”గా, నంది ని వా#హనంగా కలవాడు కాబట్టి ”వృషభవాహనుడు”.
ఇవేకాక ఆగమ శాస్త్రాల్లో, ఆయనకు బహునామాలు విశ్లేషించ బడ్డాయి.” అని వివరించాడు కృష్ణుడు. విష్ణుమూర్తి ప్రతీరోజూ తామరపుష్పాలతో స#హస్రనామాలుతో అభిషేకం చేయడంవల్ల, శివుడు సంతోషించి, సంతుష్టుడై ”సుదర్శన చ క్రం” అనే ఆయుధాన్ని బ#హూకరించాడు. వ్యాఘ్రపాదుడనే వి ప్రుని కుమారుడు ఉపమన్యువు బాల్య దశలో సరైన ఆహారం, తాగడానికి పాలు దొరక్క శివుడు గురించి తపస్సు చేసి క్షీరసా గరాన్నే వరంగా పొందాడు. ఇంద్రద్యుమ్నుడు అనే మహారా జు చాలా పాపాలు చేసాడు. తన ఆస్థానంలో ఉన్న వేదపండి తుల సూచనమేరకు శివనామాలు స్తుతించడం, ప్రణవంతో కూడిన పంచాక్షరీ మంత్రాన్ని జపించడం వల్ల ఉత్తమగతులు పొందాడు.
ఆదిశంకరాచార్యులు తండ్రి శ్రీ శివగురువు, తన భార్యతో కలిసి, త్రిచూర్‌లోని వృషభాచలం అనే కొండపై నెలకొన్న వృషాచలేశ్వరుని నిత్యం, రుద్ర సంహత నమక, చమకం పారాయణలతో అభిషేకం చేయడంతోనే జన్మించారు. సాక్షా త్తుశివుని అంశగానే భావిస్తున్నారు. ప్రస్తుత శృంగేరి పీఠాధి పతి శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి కూడా శివానుగ్రహం వల్లనే జన్మించినట్లుగా జీవితచరిత్ర తెలుపుతోంది.
నయనార్‌లు శివభక్తులు. వారిలో పంచమ కులానికి చెం దిన పుల్లయ్య గొప్ప శివభక్తుడు. చిదంబరం దగ్గరగా ఉన్న తిరుప్పగూర్‌లోని శివుడు లోకనాథుడను దర్శించడానికి వెడి తే, దేవాలయం అధికారులు ధ్వజస్థంభం వరకే అనుమతిం చారు తప్ప పరమేశ్వరుడు దర్శనం చేయనివ్వలేదు.
”పంచాక్షరీ మంత్రం పావన మంత్రం” అంటూ కీర్తిం చేసరికి గుడిలోని నంది ప్రక్కకు జరిగింది. దాంతో శివుని దర్శ నం కలగడం, అక్కడే ఉన్న అధికారులు, ఇతరులు, ఆశ్చర్య పోయారు. ఇప్పటికీ ఆ నంది అలాగే ఉంది. ఇలా చాలామంది భక్తులు మనకు గోచరిస్తారు. అందుకే అంటారు.
”శివనామ తరీం ప్రాప్య సంసారబ్ధం తరంతయే
సంసార మూల పాపాని తాని నశ్యంత్యం సంశయం”

అంటే సంసారం అనే సముద్రంలో శివనామమనే పడవ తో పయాణం చేస్తే సకల పాపాలు #హరిస్తాయి. అనడంలో సందే#హం ఏమీలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement