Friday, May 3, 2024

తులంపై రూ.600 తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి

నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉ్నాయి..బంగారం తులంపై ఏకంగా రూ.600 మేర ధర తగ్గింది. దీంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.600 మేర తగ్గి రూ.46,100కు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.660 తగ్గి రూ.50,290కు కుప్పకూలింది. బంగారం ధరలు పండగ సీజన్ సమయంలో కూడా ఇదే విధంగా పడిపోయాయి. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడంతో… బంగారం ధరలు మళ్లీ పతనమవుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేటు 75 బేసిస్ పాయింట్లు పెరగడంతో.. బంగారానికి ప్రతికూలంగా మారింది. బంగారం ధర విజయవాడ మార్కెట్లో కూడా ఈ స్థాయిలోనే తగ్గింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ.46,100కి పడిపోయింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.660 తగ్గి రూ.50,290కు దిగొచ్చింది.విజయవాడ, హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధానిలో కూడా బంగారం ధర ఇదే స్థాయిలో కుప్పకూలింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ.46,250కి, అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.660 తగ్గి రూ.50,440కి పడిపోయింది.అయితే బంగారం ధరలు భారీగా పడిపోయిన ఈ సమయంలో వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో రూ.400 పెరగడంతో.. ఈ ధర రూ.64,400కు చేరుకుంది. దేశ రాజధానిలో అయితే వెండి రేటు భారీగా పైకి ఎగబాకింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,900 మేర పెరిగింది. దీంతో ఢిల్లీలో వెండి రేటు రూ.60 వేలకు చేరుకుంది. విజయవాడలో వెండి రేటు రూ.400 పెరిగి రూ.64,400గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement