Friday, April 26, 2024

సమతా కుంభ్ – 2023

ఉషోదయ వేళలో సమతామూర్తి సన్నిధిలో ఆచార్యులవారు వేద విద్యార్థులు, అర్చక స్వాములతో కలిసి భక్తులందరికీ మొదట గురుపరంపర అనుసంధాన పూర్వకంగా మంత్ర అనుసంధానం చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించారు. తర్వాత భగవత్‌ ఆరాధన సేవాకాలం కొనసాగింది. శ్రీస్వామివారు స్వయంగా భక్తులంతా తీర్థాన్ని అనుగ్రహించారు. దివ్య సాకేత శ్రీ సీతారామస్వామి వేంచేశారు. ధ్వజారోహణ గరుడ పట సంబంధిత యజ్ఞ పూర్ణాహుతి జరిగింది. సూర్యవంశీ సంజాతుడు నులివెచ్చని సూర్యకిరణాలను ఆస్వాదిస్తూ ఆచార్యులతో పాటు స్వాముల వేదఘోషల నడుమ వయ్యారి నడకలతో ఆలయ ప్రాంగణంలోనికి వేంచేశాడు. ఆచార్యల స్వహస్తాలతో గరుడ పట ఆరాధన, ధ్వజారోహణం చేయించారు. వేద ఘోషతో భేరితాడనం జరిపించారు. తదనంతరం గరుడ పట ప్రసాదాన్ని సంతానార్థులైన భక్తులకు అనుగ్రహించారు. గరుడ ప్రసాదం గర్భాశయంలోని నాగ దోషాలను తొలగించే శక్తి కలిగి ఉంటుంది. తదుపరి యాగశాలలో అగ్ని ఆవిర్భావం, అగ్ని ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరిగాయి. యాగశాల పెరుమాళ్ల సన్నిధిలో ముందుగా వేద పారాయణాలు ప్రారంభమయ్యాయి. యజమానులకు కంకణధారణాలు జరిగాయి. యాగశాలలో పెరుమాళ్లు కుండంలో అగ్నిరూపంలో, కుంభంలో జలరూపంలో, మండలంలో మండల రూపంలో, బింబంలో శక్తి రూపంలో, చతుస్థాన అర్చన స్వీకరించారు. తదుపరి పూర్ణాహుతి, వేద విన్నపాలు, ప్రసాద గోష్ఠితో ఉదయపు కార్యక్రమం సుసంపన్నం చేయించారు స్వామివారు. సాయంత్రం 5 గంటల నుంచి 5:45 గంటల వరకు శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం ఘనంగా నిర్వహించారు. యాగశాలలో ఆరాధనలతో పాటు భేరీతాడనం, దేవతాహ్వానం జరిపించారు. సాయంత్రం 6 గంటలకు సాకేత రామచంద్ర ప్రభువుకు చంద్రప్రభ వాహన సేవ రంగరంగ వైభవంగా జరిపించారు. ఆ తర్వాత దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు జరిపించారు.

ఈ రోజు జరిపించిన 18 గరుడ సేవల వివరాలు
1.శ్రీరంగం
పెరుమాళ్‌: పెరియపెరుమాళ్‌/ శ్రీరంగనాథుడు
అమ్మవారు: పెరియపిరాట్టి/శ్రీరంగనాయకి

2.ఉఱైయూర్‌
పెరుమాళ్‌: అళగియ మణవాళన్‌/సుందరజామాత
అమ్మవారు: వాసలక్ష్మీ/ కమలవల్లి

3.పుళ్ళంపూతంగుడి
పెరుమాళ్‌: ధృఢచాపధర శ్రీరామచంద్ర/ వల్‌విల్లిరామన్‌
అమ్మవారు: హేమాంబుజవల్లి, పొత్తామరైయాల్‌, భూదేవి

4.అన్బిల్‌
పెరుమాళ్‌: ఉజ్వలపూర్ణ శ్రీమూర్తి పెరుమాళ్‌/ సౌందర్యరాజ పెరుమాళ్‌
అమ్మవారు: అళగియ వల్లీ తాయార్‌, భూదేవి

- Advertisement -

5.కరంబనూర్‌
పెరుమాళ్‌: పురుషోత్తమ పెరుమాళ్‌
అమ్మవారు: పూర్ణవల్లి/ పూర్వాదేవి/ భూదేవి

6.తిరువెళ్ళరై
పెరుమాళ్‌: పుండరీకాక్ష పెరుమాళ్‌
అమ్మవారు: చంపకవల్లి/పంగయచ్చెల్వినాచ్చియార్‌/ భూదేవి

7.తంజమామణికోయిల్‌
పెరుమాళ్‌: నీలమేఘ పెరుమాళ్‌
అమ్మవారు: శెంకమలవల్లీ తాయార్‌/ భూదేవి

8.తిరుప్పేర్‌ నగర్‌
పెరుమాళ్‌: అప్పక్కుడత్తాన్‌ పెరుమమాళ్‌/ అపూప ప్రియ రంగనాథుడు
అమ్మవారు: కమలవల్లీ, భూదేవి

9.తేరళందూర్‌
పెరుమాళ్‌: అమరువి యప్పన్‌/ గోసఖుడు
అమ్మవారు: శెంకమలవల్లి/పుండరీకవల్లి, భూదేవి

10.ఆదనూర్‌
పెరుమాళ్‌: ఆడంళక్కుం మెయ్యన్‌ పెరుమాళ్‌
అమ్మవారు: శ్రీరంగనాయకి, భూదేవి

11.శిరుపులియూర్‌
పెరుమాళ్‌: కృపాసముద్రుడు/ అరుళ్‌మాకడల్‌ పెరుమాళ్‌
అమ్మవారు: తిరుమామగళ్‌ నాచ్చియార్‌/ శ్రీదేవి, భూదేవి

12.తిరుచ్చేరై
పెరుమాళ్‌: సారనాథ పెరుమాళ్‌
అమ్మవారు: సారనాయకి, భూదేవి

13.తలైచ్చెంగనాణ్మదియం
పెరుమాళ్‌: వ్యోమజ్యోతి పెరుమాళ్‌/ నాణ్మదియప్పన్‌
అమ్మవారు: శెంకమల వల్లి/తలైచ్చంగ నాచ్చియార్‌, భూదేవి

14.కుంభకోణం
పెరుమాళ్‌: ఆరావముదన్‌ పెరుమాళ్‌
అమ్మవారు: కోమలవల్లి, భూదేవి

15.తిరుక్కండియూర్‌
పెరుమాళ్‌: హరశాప హర పెరుమాళ్‌/ బలినాథుడు
అమ్మవారు: కమలవల్లి తాయార్‌, భూదేవి

16.తిరువిణ్ణగర్‌
పెరుమాళ్‌: ఉప్పిలియప్పన్‌/ఒప్పిలియప్పన్‌
అమ్మవారు: భూమిదేవి

17.తిరువాలి-తిరునగరి
పెరుమాళ్‌: వయలాళి మణవాళ పెరుమాళ్‌
అమ్మవారు: అమృత ఘటవల్లి, భూదేవి

18.తిరుక్కణ్ణపురం
పెరుమాళ్‌: శౌరిరాజ పెరుమాళ్‌

అమ్మవారు: కణ్ణపుర నాయకి, భూదేవి, నీళాదేవి, ఆండాళ్‌

చివరగా హారతి, శాత్తుముఱై, ప్రసాద గోష్ఠి నిర్వహించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement