Sunday, May 19, 2024

సదా ఆదర్శనీయులు రమణ మహర్షి


నేడు ఆధునిక భారతవానిలో ఉన్న ప్రతి ఒక్క యు వతకు భగవాన్‌ రమణ మహర్షి సదా ఆదర్శనీ యులు. ఆయనను ఆదర్శంగా తీసుకుంటే చదువుల వల్ల ఏర్పడే ఒత్తిడిని జయించవచ్చు. ఆలోచనలలో నూతన ఒర వడిని సృష్టించవచ్చు.
భగవాన్‌ రమణులు చాలా చిన్న వయసులోనే 16 ఏండ్ల వయసులో ఆత్మజ్ఞానం కోసం మౌనాన్ని ఆశ్రయించారు. ఆ మౌన సాధనలో గొప్ప అనిర్వచనీయమైన అనుభూతికి లోను అయ్యారు. 16 ఏండ్ల వయస్సులో ఉన్న యువత గురించి తెలుగులో ఒక సామెత ఉంది ”మీసాలు వచ్చే సమయంలో దేశాలు కనిపించవు” అని.
భగవాన్‌ గురించి చిన్నతనం నుంచి మనకు తెలిసిన విష యాలను మన పిల్లలకు వివరిస్తే వాళ్ళలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. విచక్షణా జ్ఞానం అలవడుతుంది. ఏది మంచి, ఏది చెడు, అని విచారించే శక్తి వారిలో వేళ్ళూనుకుంటుంది. తద్వారా మంచిచెడులను తెలుసుకోగలుగుతారు. యుక్త వయసులోకి వచ్చే పిల్లలకు సరైన వయసులో యోగ, ప్రాణా యామం, ధ్యానం వంటివి నేర్పించగలిగితే శరీరం అల సట లేకుండా చైతన్యవంతమౌతుంది. ధ్యానంవల్ల మనసు ప్రశాం తంగా ఉంటూ, వారి వ్యక్తిత్వ వికాసం వారి అభివృద్ధికి మరింత దోహదపడుతుంది. సద్గురువులతో అప్పుడప్పుడు సత్‌ సాంగత్యం వలన నేను ఎవరు? అని తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. వారి ఆలోచనలు చైతన్యవంతమై జీవి తం అంటే ఆనందమయమై ఈ సమాజనికే ఒక ఆదర్శంగా జీవిస్తారు. మనకు ఆదర్శంగా నిలిచి, సన్మార్గంలో పెట్టే యోగులు గురువులు అందరు దాదాపు అదే వయస్సులో ఆత్మజ్ఞానం కోసం పరుగులు పెట్టినవారే. అందుకే తల్లిదం డ్రులు తమ పిల్లలను మొక్కగా వున్నప్పుడే సన్మార్గంలో పెట్టాలి. సమాజానికి మంచి యువతను అందించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement