Sunday, May 26, 2024

పుడమితల్లికి ప్రణామం

గృహస్థునకు గృహము ఎటువంటిదో జీవునికి స్థూల శరీరమైన దేహ ము అటువంటిది. అటువంటి కోటానుకోట్ల దేహములతో నిండి ఉన్నదే దేశము.మన దేహమునకు కారణమైన తల్లి ఎటువంటిదో దేశ ప్రజ లందరికి తల్లి భరతమాత. అందువలననే దేశమంటే మాతృ సమానమైన దివ్యధామము. పంచభూతాత్మకమైన ఈ తనువు జననము, యవ్వనము, వార్థక్యమును పొంది మరణముతో తిరిగి పంచభూతములలో లీనమయి పోతున్నది. అంటే త్వక్కు, మాంసము, నెత్తురు, నాడులు, మేధస్సు, మజ్జ, ఎముకలు మొదలగు ధాతువులు భూమిలో మట్టిగా మారి కలసిపోవు చున్నవి. పంచీకృతములైన స్థూల ధాతువుల వలన ఏర్పడిన ఈ శరీరము భూమిలో కలసి ఆత్మమాత్రము నిత్యమై నిలిచి ఉంటున్నది. ఈ స్థూల శరీరముతో జీవుడు ఇంద్రియముల ద్వారా ధర్మాధర్మ కర్మలను చేసి పుణ్యపాపములను మూటగట్టుకుంటున్నాడు. నేను, నాది అను అహంకారముతో విర్రవీగుచున్నాడు.
అజ్ఞానము, అలసత్వము, జడత్వ ము, నిద్ర, మూఢత్వము మొదలైన తమోగుణ లక్షణాలతో ఈ భూమి కి భారముగా నిలిచి ప్రకృతికి విరుద్ధముగా ప్రవర్తించువారు తిరిగి ఈ జనన మరణాలలో చి క్కుకొనుచున్నారు. ఇటువంటివా రే దేశాన్ని ఒక మట్టిగా భావించు చున్నారు. అయితే యధార్థమున కు దేశం మృత్తికేనయినా మానవున కు జన్మనిచ్చిన తల్లి. మట్టి నుండే పు డుతున్నాం మట్టిలోనే కలుస్తున్నాం. పరోక్షంగా మట్టి నుండి ఆహారం, దాని నుండి జీవుడు జనిస్తున్నాడు. కాబట్టి ప్రత్యక్షం గా మనం తల్లి గర్భం నుండి జనించినా అందరికీ ఆధారం ఈ భూమి. అందుకే జననీ జన్మభూమి, మన దేశం మన కన్నతల్లి,
అందువలననే భూమిని భూదేవిగా, పుడమితల్లిగా అభివర్ణించారు. ప్రకృతిని పంచభూతమయిన దేవీ దేవతలుగా పూజిస్తోంది మన సనాతన ధర్మము. భారతమాతకు జేజేలు అంటూ నినదిస్తోంది భరత జాతి. ఈ కర్మభూమి మృత్తికలో లీనమయిన, తిరిగి జన్మించిన ప్రతి జీవి భరతమాత కన్నబిడ్డలే!
కన్నతల్లి అవిభాజ్యమైనది. మాతృమూర్తిని అపురూపంగా చూసుకునే సంస్కృతి భారత సంస్కృతి. మాతృప్రేమకు మలినముండదు. తన కన్న బిడ్డలను ప్రాణసమానంగా చూసుకునేదే తల్లి. అందుకే ”మాతృదేవోభవ:” అన్నారు. కన్నతల్లిని సరిగా చూడనివాడు, హింసించేవాడు మానవుడు అవ్వడు. అటువంటి దానవులకి ఈ పుడమితల్లిపై చోటుండదు.
దేశాన్ని ఒక స్త్రీ మూర్తి రూపంలో భారతమాతగా పూజించే అద్భుత మైన దైవీభావన ప్రపంచంలో ఒక్క సనాతన ధర్మంలోనే ఉంది. దీనిని ఎవరైనా అనుసరించినా, అనుసరిస్తున్నా వారు దైవాంశ సంభూతులుగానే భావించవచ్చు. తల్లి ఒడి ఎంత కమ్మగా ఉంటుందో అనుభవించిన ప్రతి బిడ్డకూ తెలుసు. అదేవిధంగా మన దేశ భౌతిక రూపాన్ని తలచుకున్నా, ఈ మట్టి వాసన చూసినా అదే భావన కలగడంలో ఆశ్చర్యం ఏముంది? కల గాలి కూడా,అప్పుడే వారు అసలైన సంతానంగా భావించవచ్చు. మన తల్లి గుర్తులను మనం ఎంతో అపురూపంగా దాచుకుంటాం. ఆమె వాడిన వస్తు వులను, పెట్టుకున్న ఆభరణాలను, తయారుచేసిన వస్తువులను గుండెల్లో పదిలపరచుకుంటాం.అలాగే ఈ మట్టిలో జన్మించిన భరతజాతి తల్లి భరత మాత చిహ్నాలను, చరిత్రను మదిలో పదిలపరచి తిరిగి తమ సంతానానికి అందించకపోతే కృతఘ్నుడు అవుతాడు.
”సర్వేజనా సుఖినోభవంతు”అనే విశ్వమానవ కళ్యాణనినాదాన్ని భరత మాత తన సనాతన ధర్మంగా జగతికి అందిస్తోంది. భూదేవిని సహన మూర్తిగా మన పౌరాణిక చరిత్ర అభివర్ణించింది. ఈ వేదభూమి భూదేవిని పరిపరి విధాల స్తుతించింది. భూదేవికి ఎప్పుడు కష్టం కలిగినా అవతార మూర్తిగా ఆదుకున్నాడు నారాయణుడు.
భూమికి పూజలు అందించే ఒక గొప్ప సంస్కృతి మన భరతజాతిది. భూదేవిగా పూజిస్తూ, ఆమె యోగక్షేమాలను స్తుతిస్తూ అం దించే భూసూక్తమును సంగ్రహంగా పరిశీలిస్తే మన కు అవగతమవుతుంది. అధర్వవేదంలో నిక్షిప్త మై ఉన్న ఈ బీజాక్షర సూక్తం అత్యంత మహిమగలది. ఆ సూక్త మంత్రార్థం ఇలా కొనసాగుతుంది. భూగోళాన్ని ఒక దైవీ సంపదగా భావించి పర్యా వరణ రక్షణ కల్పించేదిగా భూమి సూక్తమ్‌ తన మంత్రధారణ చేస్తుంది.
ఓ! భూమాతా! మానవుల మధ్య వైర భావం సమసిపోవు గాక! ఎత్తు పల్లాలు, సమతలా లు అన్నీ ఎవరికి చెందినవో, నీలోనున్న ఔషధాలు ఎవరు వృద్ధిచేసి మోస్తున్నారో తల్లిd మాకు నీ విశాలమైన స్థలం ఇవ్వగలవుగాక! మమ్ములను పరిపుష్టులను చేయుగాక! చుట్టుముట్టిన ప్రవహింపచేసే నదులను రేయింబవళ్ళు ప్రవహింపజేయుచున్నతల్లిd! మాకు సంపదను, వర్చస్సును ప్రసాదించుగాక!
ఓ పుడమి తల్లిd! నీకు ప్రణామం. నీ లోపల ఏముందో, నీ నాభి మధ్య లో ఏముందో, నీ దేహం నుండి క్షీర సమానమైన ఎలాంటి ఆహారం ఉద్భవిస్తోందో వాటిని మాకు అందించు. మమ్ములను పునీతులను చేయి, నా తల్లి భూమి, నేను నీ పుత్రుడను.నీతో గూడిన సమస్త దైవీశక్తులు మాకు సమృద్ధిగా సం పదలు ప్రసాదించుగాక! లేచినపుడు, కూర్చున్నపుడు, నిలబడుతున్నపుడు, నడుస్తున్నపుడు, ఎడమ, కుడి కాళ్ళతో భూమిని తన్నుచున్నాము మన్నించుగాక! ఓ! మాతా! నిన్ను త్రవ్వి దేనిని నాటినా అది సత్వరమే పెరుగు గాక! సమస్తమును పవిత్రీకరించే తల్లిd! నీ మర్మస్థానాలనో, హృదయ స్థానాలనో ఛిద్రం చేయకుండా ఉందుముగాక! నీ ఒడిలో గ్రామాలు, అరణ్యాలు, సభలు, యుద్ధాలు, జనసమూహాలు ఉన్నాయో అక్కడ ప్రియమైన భావనతోనే ఉందుముగాక!
ఓ తల్లిd! మమ్ములను మంగళకరంగా నెలకొనేటట్లు శోభలను చేకూర్చు. దేవలోకంలో మమ్ములను సంతోషముగా ఉంచి, సంపదలు ఐశ్వర్యాన్ని అనుగ్రహించు. ఈవిధంగా భూమి సూక్తం దేవిని స్తుతిస్తోంది.
మనం కూడా సర్వదా భూమాతను, భరతమాతను పూజిద్దాం. భారత మాతాకీ జై!
ఓ పుడమి తల్లిd! నీకు ప్రణామాలు.


– వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement