Saturday, June 1, 2024

Sanyukta Menon : బాలీవుడ్ బాట ప‌ట్టిన సంయుక్త

తెలుగు లో భీమ్లా నాయక్‌, బింబిసారా, సర్‌, విరూపాక్ష, డెవిల్‌ సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. ఈ అమ్మడు తెలుగు లో కంటే మలయాళం, తమిళ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా సౌత్ లో స్టార్‌ హీరోయిన్ గా నిలిచిన విషయం తెల్సిందే. 8 ఏళ్లుగా సౌత్‌ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంయుక్త మీనన్‌ ఎట్టకేలకు బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ కి ఓకే చెప్పింది.

ఇటీవలే దర్శకుడు చరణ్‌ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో రూపొందబోతున్న హై బడ్జెట్‌ హిందీ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించబోతుంది. ఇదే సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజోల్‌ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది.

- Advertisement -

ప్రభుదేవా మరియు నసీరుద్దీన్‌ షా లు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమాలో సంయుక్త నటించడం ద్వారా మంచి గుర్తింపు దక్కే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా సౌత్ ఇండియన్‌ సినీ హీరోయిన్స్ కు బాలీవుడ్‌ అనేది చాలా పెద్ద కోరిక.

అక్కడ హిట్‌ అయిన సౌత్‌ ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అయితే అక్కడి ప్రేక్షకులను మరియు ఫిల్మ్‌ మేకర్స్ ను మెప్పించడం అంత సులభం కాదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement