Friday, June 14, 2024

TG | గుట్కా, పాన్‌ మసాలాపై నిషేధం.. ఉత్త‌ర్వులు జారీ

పొగాకు, నికోటిన్‌ కలిగిన గుట్కా, పాన్‌ మసాలా తయారీ, నిల్వ, సరఫరా, రవాణా, అమ్మకంపై నిషేధం విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. శుక్రవారం, మే 24 నుండి ఒక సంవత్సరం పాటు ఆర్డర్ అమలులో ఉంటుందని డిపార్ట్‌మెంట్ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement