Saturday, June 1, 2024

Urvashi Rautela : ఈ డ్రెస్ రూ.105 కోట్లా…

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు కళ్లు చెదిరే డ్రస్సులు ధరించి తమ అందాలను ప్రదర్శిస్తారు. అయితే బాలయ్యతో పాటు ఎన్ బీకె 109 చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ ఊర్వశీ రౌతేలా కేన్స్ వేదికగా ఖరీదైన డ్రస్సులలో మెరిసిపోయి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి కారణం ఆమె ధరించిన రెండు డ్రస్సుల విలువ రూ.105 కోట్లు కావడమే.

రెండు రోజుల పాటు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై మెరిసిన ఊర్వశీ రౌతేలా తొలిరోజు ఓ పింక్ గౌన్ ధరించింది. దాని ధర రూ.47 కోట్లు అని చెబుతున్నారు. ఇక కేన్స్ వేడుకలలో నాలుగో రోజు మరింత ఖరీదైన డ్రెస్లో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఈ బ్లాక్ అండ్ వైట్ కస్టమ్ మేడ్ డ్రెస్ ధర ఏకంగా రూ.58 కోట్లు అని చెబుతున్నారు.

ఈ లెక్కన ఈ రెండు డ్రెస్సులు కలిపి రూ.105 కోట్లు అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ సారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అందాల తార ఐశ్వర్య రాయ్తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కియారా అద్వానీ, అదితి రావ్ హైదరీ, శోభితా ధూళిపాళ్ల, ప్రీతి జింటా తదితరులు కనిపించారు. అయితే వీరందరి కన్నా ఊర్వశి రౌతేలా ప్రత్యేకంగా కనిపించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement