Sunday, May 19, 2024

శాంతికాముకుని వైశిష్ట్యం

నేడు బుద్ధ పౌర్ణమి

వైశాఖ శుద్ధ పౌర్ణమి అత్యంత విశిష్టమైన రోజు. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో కూర్మ, బుద్దావతారాలు రెండూ ఈనాడే ప్రారంభంగావడం గమనార్హం. భూమండల ప్రభువు అయిన సనత్కుమారులు- పరమ గురువుల పరంపర మధ్య వారధి అయిన గౌతమ బుద్ధుడు జన్మించిన పవిత్ర పర్వదినం. బుద్ధుని జీవితానికి వైశాఖ పౌర్ణమికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం కపిలవస్తు రాజు శుద్ధోధనుడు, మహామాయలకు లుంబినీ వనంలో సాల వృక్షఛాయలో వైశాఖ పౌర్ణమి రోజున సిద్ధార్థుడు జన్మించాడు. గయలో మర్రిచెట్టు కింద జ్ఞానోదయం పొంది సిద్ధార్థుడు బుద్ధుడు మారినది, కుసినర గ్రామంలో సాలవృక్షం కింద గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందినదీ వైశాఖ పూర్ణిమ నాడే కావడం విశేషం. అందుకే వైశాఖ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటారు.

గౌతమ బుద్ధుడు ఒక శాంతికాముకుడు. ఐహిక సుఖాలను వదులుకోవడం, కోరిక లను త్యజించడం, క్రమశిక్షణతో జీవించడం, ధ్యానం ద్వారా ఆత్మను ప్ర సన్నం చేసుకోవడం మొదలైనవి బుద్ధుడి సిద్ధాంతాలుగా ప్రాచుర్యంలో ఉన్నాయి. బుద్ధు నికి బోధిచెట్టు కింద జ్ఞానోద యం జరిగినట్లు బౌద్ధమతం చెబుతుంది. ఆధ్యాత్మిక భావాన్ని మరింత లోతుగా చేసుకోవాలనుకునేవారికి, బుద్ధుని సన్నిధిలో ప్రశాంతంగా ధ్యానం చేసు కోవాలనుకునేవారికి బౌద్ధ ఆరామాలు ప్రముఖంగా నిలుస్తాయి. భారతదేశం అనేక పురాత న బౌద్ధ ఆరామాలు, బుద్ధుని దేవాలయాలకు నిలయంగా ఉంది.

బోధి వృక్ష పూజలు

గౌతముని బుద్ధుడిగా మార్చిన బోధి వృక్షానికి పూజచేసే ఆచారం ఆ కాలంలోనే ప్రారంభమైంది. బేతవన విహారంలో బుద్ధుడు బస చేసి ఉన్న రోజులలో ఒకరోజు ఓ భక్తు డు పూలు తీసుకొని వస్తాడు. ఆ సమ యంలో గౌతముడు లేకపోవడంతో చాలాసేపు వేచి చూసి నిరుత్సాహంతో పుష్పాలను అక్కడే వదలి వెళ్లిపోతాడు. ఈ విషయం గమనించిన బేతవన విహారదాత ఆనంద పిండకుడు బుద్ధుడు వచ్చిన వెంటనే ఆ విషయం వివరిస్తాడు. ఆయన లేనప్పుడు భక్తులు పూజ చేసుకోవడానికి ఆ ప్రదేశంలో ఏదైనా వస్తువును ఏర్పాటుచేయాల ని కోరాడు. విగ్రహారాధనకు అనుమతించని బుద్ధుడు బోధివృక్షానికి పూజలు చేయమని చెప్పాడు. అప్పటి నుంచీ బేతవన విహారంలో ఒక బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు. అప్పుడు అదో ఉత్సవంలా సాగింది. కోశల దేశపు రాజు ఏకంగా తన పరివా రంతో

- Advertisement -

వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఇదంతా జరిగింది కూడా వైశాఖ పౌర్ణమి రోజే అని చెబు తారు. అందుకే బౌద్ధులందరూ వైశాఖ పౌర్ణమి రోజున బోధి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు. బౌద్ధమతం వ్యాపించిన అన్ని దేశాల్లోనూ వైశాఖ పౌర్ణమి వేళ బోధి చెట్టుకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు బౌద్ధులందరూ బోధి చెట్టుకు రంగు రంగుల జెండాలు కట్టి సాయంకాలం సంధ్యావేళలో దీపాలను వెలిగిస్తారు.

‘వటసావిత్రి’ వ్రతం

వైశాఖ పౌర్ణమి రోజు బోధివృక్షానికి పూజలు చేయడం ఆచారంగా మారిం ది. బౌద్ధమతం వ్యాపించిన అన్ని దేశాల్లో వైశాఖ పౌర్ణమి పూజ ఘనంగా జరుగుతుంది. బోధివృక్షానికి జెండాలు కట్టి, దీపాలు వెలిగిస్తారు. హీనయాన బౌద్ధమతాన్ని అవలంబించే బర్మాలో ఈ ఉత్స వం నేటికీ సాగుతోంది. రంగూన్‌, పెగు, మాండలే ప్రాం తాల్లో బుద్ధ పౌర్ణమిని వైభవంగా, నియమనిష్ఠలతో చేస్తారు. రోజు మొత్తం సాగే ఈ ఉత్సవంలో మహి ళలు పరిమళ జలభాండాన్ని తలపై ధరిస్తారు. మేళతాళాలు, దీపాలు, జెండాలు పట్టుకుని ఊరంతా యాత్ర చేసి సాయంత్రానికి కుండ ల్లోని జలాలను వృక్షం మొదట పోస్తారు. దీపాలు వెలిగించి చెట్టుకి జెండాలు కడ తారు. హిందువులు ఆచరించే వటసా విత్రి వ్రతం మొదలైనదేనని అంటారు. అయితే వటసావిత్రి వ్రతం వైశాఖ పౌర్ణ మికే కాక జ్యేష్ఠ పౌర్ణమికి కూడా చేస్తారు. తెల్లవారుజామునే నిద్ర లేచి కాలకృత్యా లు తీర్చుకుని పూజాద్రవ్యాలు తీసుకుని వటవృక్షం (మర్రి చెట్టు) దగ్గరకు వెళ్ళి పూ జచేసిన తర్వాత మర్రిచెట్టుకు దారం చుడు తూ ‘నమో వైవస్వతాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేస్తారు.

మహాబోధి ఆలయం

బీహార్‌లోని గ్రామం బోధ్‌గయ. ఇది ముఖ్య మైన బౌద్ధ యాత్రాస్థలాలలో ఒకటి. బౌద్ధమతం కూడా ఇక్కడే పుట్టిందని ప్రతీతి. ఈ ప్రదేశం ప్రసిద్ధ బోధి వృక్షానికి నిలయం. ఇక్కడే బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు.
సాంచి స్థూపం

మధ్యప్రదేశ్‌లోని రైసెన్‌ జిల్లాలో సాంచి పట్టణంలోని కొండపై ఉన్న స్థూ

పం చాలా ప్రసిద్ధి చెందింది. ఇది 3వ శతాబ్దం నాటి అద్భుతమైన బౌద్ధ స్మారక చిహ్నం.

హెమిస్‌ మొనాస్టరీ
భారతదేశ కేంద్ర ప్రాంత పాలితమైన లద్ధాఖ్‌లోని హెమిస్‌లో ఉన్న బౌద్ధ యాత్రాస్థలం హెమిస్‌ మొనాస్టరీ. దీనిని 1672లో లడఖ్‌ రాజు సెంగ్లే నామ్‌గ్యాల్‌ స్థాపించారు. ఇది లద్దాఖ్‌లోని అతిపెద్ద అత్యంత ప్రసిద్ధ మఠాలలో ఒకటి.
అలాగే హిమాచల్‌ప్రదేశ్‌లో ధర్మశాలలోని మెక్లీడ్‌ గంజ్‌లో నామ్‌గ్యాల్‌ మొనాస్టరీ ఉంది. 14వ దలైలామా వ్యక్తిగత మఠం. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ జిల్లాలో ఉన్న తవాంగ్‌ మొనాస్టరీ భారతదేశంలోని అతిపెద్ద బౌద్ధ మఠం. ఇక్కడ బుద్ధుని ఎత్తైన బంగారు విగ్రహం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement