Sunday, May 5, 2024

జపాన్‌లో భారీ భూకంపం..

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.3గా నమోదైనట్లు జపాన్‌ మెటరాలజికల్‌ ఏజెన్సీ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం 2:42 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించ‌డంతో ప్రజలు భయంతో ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. అయితే సెంట్రల్‌ జపాన్‌ లోని ఇషికావా ప్రిఫెక్చర్‌ లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు అధికారులు పేర్కొంది. సునామీ ముప్పు ఏమీ లేదని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement