Saturday, December 7, 2024

కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్‌.. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ నిరసనలు..

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భజరంగ్‌ దళ్‌పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో చేర్చి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ నాయకుల చేసిన వ్యాఖ్యలను బిజెపి నాయకులు తీవ్రంగా ఖండిస్తూ నిరసన చేపట్టారు. హిందూ ధర్మం కోసం పోరాడే బజరంగ్ ద‌ళ్ పై వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని బీజేపీ నాయకులు హెచ్చరించారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ లోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ బీజేపీ నాయకులు తమ నిరసనను వ్యక్తం చేశారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట‌ నిరసన చేయడానికి బయలుదేరిన బీజేపీ నాయకులను పోలీసులు అక్కడే అరెస్టు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట‌ కూడా బీజేపీ నాయకులు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ… ఓటు బ్యాంకు కోసం చిల్లర రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులకు హెచ్చరించారు. ఎన్ని కుట్రలు చేసినా కర్ణాటక లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూచి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదని తెలిపారు. ఈ బీజేపీ నాయకులు పోతాన్కర్ లక్ష్మీనారాయణ, పంచ రెడ్డి లింగం, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement