Sunday, May 19, 2024

శ్రీకృష్ణుడు చెప్పిన పరిహారం

మహాభారత యుద్ధంలో తన తండ్రి ద్రోణాచా ర్యుడు చంపబడినప్పుడు అశ్వత్ధా మకు చాలా కోపం వచ్చింది. తం డ్రిని కుట్రపూరితంగా హతం చేసా రని చాలా ఆవేశపడ్డాడు. దాంతో అతను చాలా భయంకర ఆయుధ మైన నారాయణ అస్త్రాన్ని పాండవ సైన్యం మీద వదిలివేసాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ”ఎవ్వరూ కూడా నారాయణాస్త్రానికి ప్రతీకారం తీర్చుకోలేరు. అది మనల్ని మన సేనల్ని కాల్చడానికి వదిలిన అస్త్రం. చేతిలో ఆయుధాలు ఉన్నవారిని అది వెంటనే నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకే మీరందరూ వెంటనే మీ చేతుల్లో వున్న ఆయుధాలను విడిచిపెట్టండి. నిశ్శబ్దంగా నిలబడి చేతులు ముడుచుకోండి. యుద్ధం చేయాలనే ఆలోచనను కూడా మన స్సులోకి తీసుకురాకండి. లేదంటే నారాయణాస్త్రం నాశనం చేస్తుంది” అని హెచ్చరించాడు. పాండవ సైన్యం అందరూ శ్రీకృ ష్ణుని ఆదేశాన్ని పాటించారు. దాంతో నారాయణాస్త్రం ఏమీ చేయలేకపోయింది. సమయం ముగిసినప్పుడు నెమ్మదిగా శాం తించింది. ఈ విధంగా పాండవ సైన్యం రక్షింపబడింది.
ఈ కథ ఒక నీతిని బోధిస్తుంది. ఎవరికి అయినా సరే ప్రతి చోటా విజయం వరించదు. విధి కోపాన్ని నివారించడానికి, మ నం కూడా అన్ని పనులను కొంత కాలం వదిలి, విజయాన్ని విధి కే వదిలేసి నిశ్శబ్దంగా చేతులు ముడుచుకుని, మంచి మనస్సుతో ఉండాలి. అప్పుడే మనం దేన్ని అయినా తట్టుకోగలుగు తాం. భగవానుడు పరిహారం చెప్పాడు. అందరం ఆచరించి తరిద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement