Sunday, May 26, 2024

జ్ఞానయోగి… యాజ్ఞవల్క్యుడు

అత్యంత మహిమాన్వితమైన ఋషిపరంపరకు ఆలవాలము పవిత్ర భరత ఖండం. ప్రపంచం అనాగరిక అంధకారంలో పడి ఉన్నప్పుడు ఈ వేదభూమి సృష్టి రహ స్యాలను ఆవిష్కరించింది. పరమాత్మను తన తపోబలంతో సాక్షాత్కరింప చేసుకుంది. మానవజాతి శాంతి మనుగడకు అనేక ధర్మశాస్త్రాలను శృతిచేసి అందించారు మహాఋషు లు. వారిలో ఒక గొప్ప ఋషి పుంగవుడు యాజ్ఞవల్క్యుడు.
సాంఖ్య, యోగముల గురించి ఈయన చేసిన విశ్లేషణ అమిత ఆదరణకు నోచుకుంది. జ్ఞానయోగముతో మృత్యువును జయించవచ్చునని నిరూపించిన జ్ఞాని యాజ్ఞవల్క్యుడు. సంఖ్యతో కూడినది సాంఖ్యజ్ఞానము. ఆత్మానాత్మ వస్తువులను సంఖ్యలతోనే లెక్కించవలెను కదా! ప్రకృతియందు గల తత్త్వములను అవగాహన చేసుకొని, అవి అవాత్మ రూపములని గ్రహించి వాటిని విడిచి పెట్టి పరమాత్మను గుర్తించుటయే సాంఖ్యయోగము.
ప్రకృతి ఎనిమిది రకాలుగా ఉంటుంది. ఆ ఎనిమిదికి వికారాలు పదహారు. అవ్యక్తం, మహాతత్త్వం, అహంకారం, పృథ్వి, వాయువు, ఆకాశం, జలం, తేజస్సు ఈ ఎనిమిది ప్రకృతి యొక్క తత్త్వాలు.
కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, వాక్కు, చేతులు, కాళ్ళు, గుదం, లింగం, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం, మనస్సు ఇవి వికారాలు. అవ్యక్త ప్రకృతి నుండి మహాతత్త్వం అయిన బుద్ధి జనించింది. దీని నుండి అహంకారం ప్రకటితమయింది. అహంకారం నుండి మనసు ప్రకటితమయింది. మనసు ఒక పదార్థం. దీని నుండే పంచమహాభూతాలు ఉద్భ వించాయి. దీనినే మానసీ సృష్టి అంటారు. మానసీ సృష్టికి ముందు ప్రాకృత సృష్టి, బుద్ధ్యాత్మ క సృష్టి, అహంకారిక సృష్టి జరిగింది. ఇక ఐదవ సృష్టి శబ్ద స్పర్శరూప రసగంధాలు పంచభూ తాల నుండి పుట్టి భౌతిక సృష్టిగా మారింది. ఇక శ్రోత, త్వక్‌, నేత్ర, జిహ్వ, ఘ్రాణంద్రియా లను బహుచింతాత్మక సృష్టి అంటారు. ఇది ఆరవ సృష్టి. కర్మేంద్రియాలు ఉత్పత్తి ఏడవ సృ ష్టి. దీనిని ఐంద్రిక సృష్టి అంటారు. ప్రాణ, సమాన, వ్యాన, ఉదానముల పైభాగం ఎనిమిదవ సృష్టి. అపాన వాయువుతో పాటు సమాన, వ్యాన, ఉదానముల నిమ్నభాగం నవమసృష్టిగా ఉత్పన్నమయింది.
ఈ విధముగా పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ ప్రాణములు, పంచభూతాలు, అంత:కరణ చతుష్టయములు కలిపి ఇరవై నాలుగు తత్త్వాలు, తొమ్మిది రకా ల సృష్టులుగా ఆవిర్భవించాయి. ఇక జ్ఞానంతో గ్రహించవలసినవి రెండు తత్త్వాలు అవి జీవా త్మ, పరమాత్మ వాటి ఏకత్వం.
ఆద్యంత రహితుడు, అక్షర స్వరూపుడు అయిన బ్రహ్మదేవుడు నిరంతరం సృష్టి, సంహా రం జరుపుతాడు. పగలు గడచిన పిదప బ్రహ్మ రాత్రి శయనించాలనే కోరిక కలిగి రుద్రుని లయ సంహారానికై ఆజ్ఞాపిస్తాడు. అపుడు రుద్రుడు ప్రచండ సూర్య స్వరూపాన్ని ధరిస్తాడు. పన్నెండు జ్వాలా రూపాలలో జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజములనే నాలుగు రకాల ప్రాణులతో నిండిన జగత్తులను భస్మంచేసి వేస్తాడు. క్షణకాలంలో చరాచరమంతా అదృశ్య మై నశించిపోతుంది. మిగిలిన పృథివీ భాగాన్ని రుద్రుడు మహాజలములో ముంచివేస్తాడు. నీరు ఇంకిపోతుంది. తిరిగి ప్రచండమైన అగ్ని ప్రజ్వరిల్లుతుంది. ఆ సమయాన వాయువు దైవస్వరూపుడై తన అష్టరూపాలతో అగ్నిని మింగివేసి ప్రచండంగా వీచడం మొదలుపెడ తాడు. తిరిగి వాయువును ఆకాశం, ఆకాశాన్ని మనసు, దానిని అహంకారం, దానిని మహాత త్త్వం, దానిని ప్రజాపతి శంభుడు కబళిస్తాడు.
శంభుడు అష్టసిద్ధులు కలిగినవాడు. సమస్త విశ్వాన్ని ఆక్రమిస్తాడు. తనలో లయం చేసు కుంటాడు. అప్పుడు ఆత్మస్వరూపుడు, అక్షయుడు, అవ్యయుడు, అభిన్నుడు, త్రికాలజ్ఞాను డు, దోషరహితుడు అయిన పరమాత్మ పరమేశ్వరుడై శేషించి ఉంటాడు. తిరిగి సృష్టి ప్రారం భమవుతుంది.
సమస్త ప్రాణులు ఎవరి నుండి పుడుతున్నాయో, ఎవరిలో లీనమవుతున్నాయో అటు వంటి వేదప్రతిపాదితమైన పరమాత్మను తెలుసుకున్నవారికే ముక్తి లభిస్తుంది. తెలుసుకో లేనివారు సంసార చక్రంలో పుడుతూ, చస్తూ ఉంటారు. వేదవేదంగాలు నేర్చినవారు కూడా పరమాత్మ గురించిన జ్ఞానం లేకపోతే కేవలం శాస్త్ర భారాన్ని మోస్తూ గతిస్తాడు తప్ప ముక్తిని పొందడు.
మనిషి తన బుద్ధి ద్వారా ప్రకృతి, పురుషుల జ్ఞానాన్ని పొందాలి. ప్రపంచంలో జనన మరణ చక్రం ఎప్పటికీ ఆగిపోదు. కర్మలన్నీ నశ్వరములే! అక్షయ ధర్మాన్ని గ్రహించాలి. సదా పరమాత్మ స్వరూపాన్ని చింతన చేస్తూ ఉన్నవారికి ఇరవై ఆరవ తత్త్వమైన పరమేశ్వరుడు అవగతం అవుతాడు. ఇరవై అయిదవ తత్త్వ రూపమైన జీవాత్మ అజ్ఞానంతో తాను పరమా త్మ వేరని భావిస్తాడు. అయితే యోగపురుషులు జీవాత్మ, పరమాత్మ ఒక్కటేనని తెలుసుకుం టారు. ప్రకృతి జడం అని ఇరవై అయిదో తత్త్వమైన జీవాత్మకు తెలుసు కానీ ప్రకృతికి జీవాత్మ అంటే తెలియదు. జ్ఞానులైన వారు వివేక దృష్టితో ఇరువది నాల్గవ తత్త్వము ప్రకృతి, ఇరువది ఐదవ తత్త్వమైన జీవాత్మతో ఇరువది ఆరవ తత్త్వమైన పరమాత్మను గ్రహించి దర్శిస్తాడు. కాని జీవాత్మ అజ్ఞానంతో కూడి ”తనను మించినవారు ఎవరూ లేరు” అనే స్వాభిమానంతో ఉంటే ఎదురుగా నిలిచిన పరమాత్మను కూడా దర్శించలేదు. అయితే పరమాత్మ సదా ఈ ఇరువది ఐదు తత్త్వాలను వీక్షిస్తూ ఉంటాడు.
ఎప్పుడైతే జీవాత్మకు ఇరువది నాలుగు తత్త్వాలు కల్గిన ప్రకృతికి తాను భిన్నమైన వాడననే జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఇరవై ఆరో మహాతత్త్వమైన పరమాత్మను సాక్షా త్కరింప చేసుకుంటాడు. పరమాత్మ దర్శనంతో జ్ఞానియై పునర్జన్మ బంధాల నుండి శాశ్వత విముక్తి పొంది పరంధామం చేరతాడు.
అక్షయత్వౌత్‌ ప్రజననే అజమత్రాహుర వ్యయమ్‌
అక్షయం పురుషం ప్రాహు: క్షయోప్యస్య నవిద్యతే
జన్మను గ్రహించినప్పటికీ క్షయ రహితుడగుటచే జీవుడు వాస్తవముగ జన్మరహితుడ ని, నాశరహితుడని, అక్షయుడని చెప్పబడెను. అతనికి క్షయమెపుడు లేదు. ఎందువలన నన గా సర్వమూ ఆత్మస్వరూపమే కదా! కానీ…
జాయన్తే మ్రియన్తేచ యస్మిన్నేతేయతశ్చ్యుతా:
వేదార్థం యేన జానన్తి వేద్యం గన్ధర్వసత్తమ
సమస్త భూతజాలము దేనియందు స్థితి గల్గియున్నదో, దేని యందు ఉత్పన్నమగుచు న్నదో, తిరిగి లయించుచున్నదో అట్టి వేదప్రతిపాదితమగు జ్ఞేయ పరమాత్మను ఎవరు తెలిసికొనలేరో వారు పరమార్థము నుండి భ్రష్టులై జనన మరణ చక్రము నందు పడిపోవు దురు. కావున జ్ఞానయోగులై పరమాత్మ తత్త్వమును తెలిసికొనుటకు సాధన చేయునని మహాముని యాజ్ఞవల్క్యుడు సనాతన వాఙ్మయము ద్వారా మానవాళికి అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement