Sunday, May 19, 2024

భవసాగరాన్ని దాటించే భగవన్నామం!

నా మస్మరణ చేసేటప్పుడు భగవంతుడు నీ రాగాన్ని, నీ తాళాన్ని, నీ సంగీత పరిజ్ఞా నా న్ని, నీ గాత్ర మాధుర్యాన్ని చూడడు. నీ ఆర్తిని, నీ ఆర్ద్రతని, నీ భావాన్ని మాత్రమే చూస్తాడు. నీ శక్తిని చూడడు. నీ భక్తిని మాత్రమే చూస్తాడు. నీ విత్తాన్ని చూడడు. నీ చిత్తాన్నే చూస్తాడు. నీ ఆర్భాటాన్ని చూడడు. నీ అంతరంగాన్ని చూస్తాడు. నీ కులాన్ని చూడ డు. నీ గుణాన్ని మాత్రమే చూస్తాడు.
భగవంతుడు వెన్న కన్న మెత్తనివాడు. వెన్న ఎంత మెత్తనిది అయినప్పటికీ, వెన్న కరిగి నేయి అవాలంటే, చిన్న వేడి అవసరం. వెన్నకన్న మెత్తనైన భగవంతుడు, అనుగ్ర#హం అనే నేతిని మనకి ప్రసాదించాలంటే, ఆర్తి, భక్తి అనే వేడిని తగిలించాలి. ఆర్తితో కూడిన భక్తి సాధన మే నామస్మరణ. మనసుకి నచ్చిన భగవన్నామాన్ని తాళం వేస్తూ రాగంగా ఆలపించటమే భజన. మానవ దేహమనే మర్రిచెట్టు కొమ్మల మీద కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్స ర్యాలనే అరిషడ్వర్గా ల పక్షులు కూచుంటాయి. మనసుని కల్లోల పరుస్తుంటాయి. మనుషులను అరుపులు శబ్దాలతో పీడిస్తుంటాయి. అప్పుడు భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ, తాళాలతో తాళం వేస్తూ, రెండు చేతులతో చప్పట్లు చరుస్తూ, నోరారా భగవన్నామాన్ని గానం చేయాలి. ఆ సడికి, భగవ న్నామ ప్రభావానికి, మన మీద వాలిన అరిషడ్వర్గాలనే పక్షులు ఎగిరిపోతాయి. అదీ భజన విశిష్టత. భగవంతుని గాన విశేషత.
అయితే మన మీంచి ఎగిరిపోయిన అరిషడ్వర్గాలనే పక్షులు, ఎక్కడికి వెళ్తాయనే సందేహం ఒకాయనకు వచ్చింది. సందేహం తీర్చమని గురువుగారిని అడిగాడు.
”ఎగిరిపోయిన అరిషడ్వర్గాలనే పక్షులు, భజనలు చేయని వాళ్ళ భుజాల మీద వాల తాయి. అని వ్యంగ్యంగా గమ్మత్తుగా గురువు చెప్పారు. భజన ప్రాముఖ్యాన్ని వివరించే అద్భుతమైన చమత్కారమిది. భజన నామస్మరణ విశాల పరిధిన ఒక్కటే. నిశితంగా చెప్పా లంటే మనం ఒక్కరమే నామాన్ని స్మరణ చేసుకోవడం నామస్మరణ. సమిష్టిగా భగవన్నా మాన్ని గానం చేసుకోవడం భజన. భగవత్‌ సాక్షాత్కారం కోరేవారికి, నామస్మరణకు మించి న ఔషధం కలియుగంలో లేనే లేదు. భగవన్నామం భవ సాగరాన్ని దాటించే సాధనం. నామస్మరణలో భగవన్నామం నీ ఊపిరి కావాలి. భగవంతుడినే నీ ఊపిరిగా చేసుకోవాలి. నామంలో భగవంతుడి (నామిని)ని చూడాలి. నామస్మరణ లో నామామృతాన్ని గ్రోల గలగాలి. జీవితమనే మహా సాగరాన్ని దాటడానికి పెద్ద ఓడ అక్కర లేదు. నామ స్మరణ అనే చిన్న తెప్ప చాలును.
అయితే నామ స్మరణ, దైవ చింతన అని రెండు ఉన్నాయి. నామాన్ని జపించటం నామ స్మరణ. ఆ నామం చేసి న లీలల ను మహమలను మననం చేసుకోవటం దైవ చింతన. ఉదా హరణకు క్రిష్ణా క్రిష్ణా అని శ్రీకృష్ణ నామాన్ని జపించటం నామ స్మరణ. శ్రీక్రిష్ణుడు ఎప్పుడో చేసిన లీలలను, మ#హమలను మననం చేసుకోవటం దైవ చింతన.
అయితే నామస్మరణకు ఏ నామం గొప్ప ది? ఏ నామాన్ని పట్టుకోవాలి? పెట్టుకోవాలి? ఏ నామాన్ని స్మరణ చేయాలి? అనే సందేహాలు సహజంగానే వస్తాయి. అన్ని నామాలూ ఒక్క టే. అన్ని నామాలూ గొప్పవే. నామమే వేరు. నామి (భగవంతుడు) ఒక్కడే. పేరులే వేరు. పరమాత్మ ఒక్కడే. భావమే వేరు. భగవంతు డు ఒక్కడే. రూపాలే వేరు.
అజ్ఞానం వలన, ఐహక బంధాల వలన, అలసత్వం వలన, ఆధునిక జీవిత గందరగో ళం వలన, అట్టడుగున పడిపోయిన ఆధ్యాత్మిక తత్వాన్ని, పైకి తీసే చిరు ప్రయత్నమే నామస్మ రణ. ”నాలుక మీద దైవనామాన్ని, కనుల ముం దు దేవుని రూపాన్ని ఉంచుకుని, భగవన్నామ స్మర ణ చేసే స్థలం ఓ పుణ్యక్షేత్రమవుతుంది. భగవన్నామం వినిపించే ప్రతి గృహమూ పరమాత్మ క్షేత్రం. ఓ పుణ్య తీర్థమే అవుతుంది” అని అంటారో మ#హనీయుడు.
ఓ పర్యాయం తుకారామ్‌ నామస్మరణ చేసుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు ఎదురుగా వస్తున్న ఒకాయన ”నామాన్ని నువ్వు యింతలా స్మరిస్తున్నావు కదా? ఏమి కోరుకుంటున్నావు? నీ కు వైకుంఠం కావాలా? కైలాసం కావాలా? స్వర్గం కావాలా? సర్వ సౌఖ్యాలు కావాలా?” అని తుకారాంని అడిగాడు.
”అయ్యా! నాకు కైలాసం, వైకుంఠం అంటే అర్థంకాదు. అవెక్క డ ఎలా ఉంటాయో తెలీదు. ఇక స్వర్గం అంటారా? నామస్మరణ చేస్తు న్నప్పుడు నేను అనుభవిస్తున్నదే స్వర్గం.” అంటాడు తుకారామ్‌.
భగవన్నామం హృదయంలో నినదిస్తే, నినాదంగా మారుమో గితే అదే స్వర్గం. మనసుపడే ఆరాటాన్ని ఆందోళనను అశాంతిని నామస్మరణ అణచివేస్తుంది. వేడెక్కిన మనసును నామస్మరణ శాంతింప చేస్తుంది. వంకర టింకరులుగా తిరిగే పాము వంటిది మనసు. ఆ మనసును వశం చేసుకునే నాగ స్వరమే ”భగవన్నామ స్మరణం.” నామస్మరణ సంసార తృష్ణను నాశనం చేస్తుంది.
ఓ ఇనుప ముక్కను రాయి మీద, రాస్తూపోతే వేడి పుడుతుంది. భగవన్నామం అనే ఇనుపముక్కతో, రాయిలాంటి మనసుని, అటుయిటు అనంతంగా, అవిచ్ఛిన్నంగా రాస్తూ పోతే, ”భక్తి” అనే వేడి పుడుతుంది. ఆ వేడి వెన్నలాంటి పరమాత్ముడి హృదయాన్ని కరగిస్తుంది. మనల్ని తరింపచేస్తుంది.
ఇప్పుడు నామం విశిష్టతను ప్రత్యేకతను తెలుసుకుందాం. పూర్వం ఓ మహర్షి ఓ పుణ్య కావ్యాన్ని లోక కల్యాణం కోసం నూరుకోట్ల శ్లోకాలతో రచించాడు. లోక కల్యాణం కోసం రచించిన కారణంగా, నూరు కోట్ల శ్లోకాలను మూడు లోకాలకు సరి సమానంగా పంచేయ మని దేవుడిని ప్రార్థించాడు. సరే అన్నాడు దేవుడు. నూరు కోట్ల శ్లోకాలను మూడు భాగాలు చేసాడు. ఒక్కొక్క లోకానికి 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 శ్లోకాలను సమంగా పంచేసాడు. 32 అక్షరాలతో కూడిన ఒక్క శ్లోకం మిగిలిపోయింది. ఆ శ్లోకం నుండి ఒక్కొక్క దశాక్షరీ మంత్రాన్ని మూడు లోకాలకు పంచేసాడు. రెండు అక్షరాలు మిగిలిపోయాయి. ఆ రెండు అక్షరాలే రామ, కృష్ణ, హరి, హర, శివ, విష్ణు, ఉమ, గౌరి, దేవి లాంటి ”నామం”లు. అంటే నూరు కోట్ల శ్లోకాలను మదించి మదించి, కుదించి అతి సూక్ష్మాతి సూక్ష్మరూపానికి వస్తే, అది అతి పవిత్రమైన మహోత్కృష్టమైన దైవ నామంగా ఆవిష్కరింపబడింది అనేది అంత రార్ధం. మహోన్నతమైన కల్పనను జోడించి, ‘నామ’ విశేషాన్ని దివ్యంగా వివరించే కథ యిది. ఇదీ నామం విశిష్టత.
”మానసిక ఆందోళనను, భవబంధాల అయోమయాన్ని, విషయ వాసనల వ్యాధుల్ని నయం చేసే మహా గుళిక నామం” అని అన్నారు ఓ మహనీయుడు. అంతేకాకుండా…
”నీ హృదయాన్ని ముప్పేట దాడిచేసి, పీడించే రజోగుణం, తామస గుణం అనే హర ణ్యకశిపుని పాలిట నృసింహావతారం భగవన్నామం” అని కూడా అంటారు ఆ మహనీయు డు. అందువల్లనే భగవత్‌ చింతన, నామ స్మరణ తప్ప, అన్యమైనదేదీ ఎరుగని ప్రహ్లా దునికి, అగ్ని, సముద్రం, విషం, పాము, ఏనుగులు, లోయలు కొండలు అన్నీ ”హరి” స్వరూపాల య్యాయి. ప్రహ్లాదుడు హరి అనుగ్రహానికి ప్రాప్తమయ్యాడు. మహా భక్తుడిగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రముఖ స్థానం పొందగలిగాడు. సంపూర్ణ శరణాగతుడై నామ స్మరణతో ప్రహ్లాదుడు ధన్యుడయ్యాడు. ఇదీ ”నామం”కు ఉన్న అద్వితీయమైన శక్తి.
నామం విశిష్టమైనది. పవిత్రమైనది. పరిశుద్ధమైనది. మనసుకు నచ్చిన ఏదో ఒక నామాన్ని మనసారా భజన చేద్దాం. భగవంతుణ్ణి చేరదాం. స్మరణ చేద్దాం సర్వేశ్వరాను గ్రహం పొందుదాం. నామం చేద్దాం. నామి కృపకు పాత్రులవుదాం. ఆ భగవంతుని కరుణా కటాక్ష వీక్షణా లలో మన జీవితాలను పండించుకుందాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement