Sunday, February 25, 2024

ఖమ్మం రాష్ట్రానికే ఆదర్శం.. మంత్రి పువ్వాడ

ఖమ్మం : నగరంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి యావత్‌ రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలో త్రాగునీటి శాశ్వత పరిష్కారం లో భాగంగా రూ.10.23 కోట్లతో నిర్మించిన 5 డివిజన్లలో నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ లను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని 20వ డివిజన్ రామ చంద్రయ్య నగర్ లో రూ.1.80 కోట్లతో నిర్మించిన 10 లక్షల లీటర్ల సామర్ధ్యం గల ట్యాంక్, 23వ డివిజన్ SP ఆఫీస్ రోడ్ లో రూ.1.65 కోట్లతో నిర్మించిన 9లక్షల సామర్ధ్యం గల ట్యాంక్, 32వ డివిజన్ గుట్టల బజార్ లో రూ.3.48 కోట్లతో నిర్మించిన 23 లక్షల లీటర్ల సామర్ధ్యం గల(బహుబలి) ట్యాంక్, 53వ డివిజన్ NSP క్యాంపులోని రూ.1.80 కోట్లతో నిర్మించిన 10లక్షల లీటర్ల సామర్ధ్యం గల ట్యాంక్, 43వ డివిజన్ ZP సెంటర్ లో రూ.1.50కోట్లతో నిర్మించిన 8లక్షల లీటర్ల సామర్ధ్యం గల ట్యాంక్ లను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్రప్రభుత్వం ఖమ్మం అభివృద్ధికి కోట్లాది రూపాయలు విడుదల చేసిందన్నారు. 75 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం ఏడేళ్లలోనే సాధ్యమైందన్నారు. ఖమ్మం ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాడు ఖమ్మం నగరం అత్యంత దారుణమైన దుస్థితిలో సరైన రోడ్లు లేక, త్రాగునీరు రాక.. ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు, ఇరుకైన దారులు, రోడ్ల మీద చెత్త చెదారంతో దుర్గంధభరితంగా ఉండేదన్నారు. ముఖ్యంగా ఖమ్మం త్రీ టౌన్ లో త్రాగునీటికి తీవ్ర ఎద్దడి ఉండేదని దానిని నేడు శాశ్వతంగా పరిష్కరించగలిగామని గుట్టల బజార్ లో రూ.3.48 కోట్లతో నిర్మించిన 23 లక్షల లీటర్ల సామర్ధ్యం గల బహుబలి ట్యాంక్ తో మొత్తం గృహాలను నల్లా కనెక్షన్లు ఇచ్చి త్రాగునీరు అందిస్తున్నామని అన్నారు.సొంత ఇంటిని శుభ్రం చేసుకున్న మాదిరిగా ఒక్కొక్కటిగా సమస్యలను అధిగమిస్తు, అభివృద్ధి చేసుకుంటూ నేడు ఖమ్మం రాష్ట్రానికే ఆదర్శంగా నిలువటం గర్వంగా ఉందన్నారు. నేడు రాష్ట్రంలో ఖమ్మం ఒక రోల్ మోడల్ గా నిలిపామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్ లు కర్నాటి కృష్ణ, బిక్కసాని ప్రశాంత లక్ష్మి, BG క్లెమెంట్, మక్బూల్, దొన్వాన్ సరస్వతి, పగడాల శ్రీవిద్య, సుడా చైర్మన్ విజయ్, పబ్లిక్ హెల్త్ EE రంజిత్, DE రంగారావు, నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement