Tuesday, May 14, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 9, శ్లోకం 5

న చ మత్స్థాని భూతాని
పశ్య మే యోగమైశ్వరమ్‌ |
భూతభృన్న చ భూతస్థో
మమాత్మా భూతభావన: ||

తాత్పర్యము : అయినను సృష్టించబడిన సమస్తము నాయందు స్థితిని కలిగియుండదు. అచింత్యమైన నా యోగ వైభవమును గాంచుము! నేను సర్వజీవులను పోషించువాడను మరియు సర్వత్రా వసింశు వాడనైనను, సర్వసృష్టికి కారణుడనైనందున ఈ దృశ్యమాన జగత్తు నందలి భాగమును కాను.

భాష్యము : శ్రీకృష్ణుడు, దేవాది దేవుడగుటచే తన యోగ శక్తితో ఈ జగత్తులన్నింటికీ ఆధారభూతమైనప్పటికినీ, అతడు వీటన్నిటికీ అతీతముగా వేరుగా నుండును. అందుచేత అతడు ఈ జగత్తులను సోషించుటకు కష్టించవలసిన అవసరము లేవు. మనము కోరుకున్నంతనే కార్యము నెరవేరదు. కాని శ్రీకృష్ణుడు ఏది కోరుకుంటే అది జరుగుట తథ్యము. అందువలన ఆయన కోరుకున్నంత మాత్ర ముననే సృష్టి, లయ సునాయాసముగా జరిగి పోవుచూ ఉండును. భగవంతుడు సర్వాన్నీ నడిపిస్తూ అతడు వీటన్నింటికీ అతీతముగా ఎలా ఉండగలుగునో అర్థము చేసుకొనుట సామాన్య మానవునికి సాధ్యము కాక పోవచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement