Sunday, May 19, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 17

17
కర్మణో హ్యపి బోద్ధవ్యం
బోద్ధవ్యం చ వికర్మణ: |
అకర్మణశ్చ బోద్ధవ్యం
గహన కర్మణో గతి:

తాత్పర్యము : కర్మ గతులను అవగాహన చేసి కొనుట అత్యంత కష్టము కనుక కర్మ అనగా నేమో, వికర్మ అనగా నేమో, అకర్మ అనగా నేమో ప్రతియొక్కరు చక్కగా తెలుసుకొనవలెను.

భాష్యము : ముక్తిని పొందుటలో కృత నిశ్చయులైన వారు కర్మ, అకర్మ, వికర్మ అను అంశాలను విశ్లేషణ చేసి తెలుసుకొనవలెను. జీవి భగవంతుని దాసుడని, భగవంతుని సేవే జీవిత లక్ష్యమని తెలిసి మిగిలిన వాటిని వికర్మలుగా భావించి త్యజించవలెను. ఈ స్పష్టత కొరకు నిష్టాతులైన భక్తుల సాంగత్యము, సాహచర్యము అత్యావశ్యకము. వారిని సేవించి ఈ రహస్యములను తెలిసికొనవలసి యున్నది. అది భగవంతుని నుండి ప్రత్యక్షముగా నేర్చుకొనుటతో సమానము. లేనిచో అత్యంత బుద్ధిమంతుడు సైతమూ భ్రాంతికి గురి కాగలడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement